Thursday, January 23, 2025

తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా అవతరణ వేడుకలు

- Advertisement -
- Advertisement -

పంజాగుట్ట: భారత్ భారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నేడు సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెలంగాణ అవతరణ వేడుకలకు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ జాతీయ ఎగ్జిక్యూటీవ్ అధ్యక్షులు వినయ్ పత్రాలే తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వేడుకలకు సంబంధించిన బ్రోచర్లను జాతీయ కోఆర్డినేటర్ భారత్‌భాయి పటేల్, సహాయ కార్యదర్శి హరికుమార్, ప్రాగ్రాం కోఆర్డినేటర్ జగ్నేష్ గోఖాని, కార్యక్రమ సలహాదారులు ఎం. అరుణ జ్యోతి, మహిళా ఇన్చార్జి భారతితో కలిసి ఆవిష్కరించారు. వినయ్ మాట్లాడుతూ తెలంగాణ రా ష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకున్నారన్నారు.

వారి వారి సంస్కృతులు ప్రబింబించేలా, తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆహార పదార్థాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భారతమాతా హారతి లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు. అదే విధంగా సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తేనే వారు వారి ముందు తరాలకు తీసుకెళ్లగలుతారని పేర్కొన్నారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, తెలంగాణ, హర్యానా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్, బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రికి షన్. రెడ్డిలకు ఆహ్వానపత్రికలు పంపించామన్నారు. సుమారు 5 వేల నుంచి 7వేల మంది వరకు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో భారత్ భారతి ప్రతినిధులు సరోజ్ దహరిపూర్కర్, కనక కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News