Wednesday, January 22, 2025

అవార్డుల గ్రామాలకు ప్రోత్సాహక నిధులు : మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : చక్కని ప్రతిభను కనబరచి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన, అవార్డులు వచ్చిన గ్రామాలకు ప్రోత్సాహకంగా నిధులు అందజేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జాతీయ అవార్డును పొందిన నెల్లుట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్ల స్వరూపరాణి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డిలను ఆదివారం మంత్రి అభినందించారు. ఆదివారం పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో వారికి శుభాకాంక్షలు తెలిపి.. శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక నిధుల ఇవ్వడంతో పాటు వాటి ప్రేరణతో చక్కని ప్రతిభ చూపే గ్రామ పంచాయతీలపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహకారంతోనే తమ గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని నెల్లుట్ల సర్పంచ్ చిట్ల స్వరూపరాణి తెలిపారు. తమకు అవార్డు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలుస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు భూపాల్‌రెడ్డి, వార్డు సభ్యుడు కొమ్మ రాజుల నర్సింహులు ఎర్రబెల్లి యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు సురుగు సుధాకర్‌గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News