Monday, December 23, 2024

మరి రెండు రోజుల పాటు నగరంలో వానలు

- Advertisement -
- Advertisement -

Two more days rain in GHMC
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్(జిహెచ్‌ఎంసి) పరిధిలో మరి రెండు రోజులు భారీ వానలు కురియనున్నాయి. ఈ మేరకు జిహెచ్‌ఎంసి అధికారులు ఓ ప్రకటన చేశారు. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని కూడా వారు సూచించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేలా ప్రత్యేక సహాయక టీమ్‌లు రెడీగా ఉన్నాయి. ప్రజలు ఎలాంటి సహాయం కావాలన్నా జిహెచ్‌ఎంసి టోల్ ఫ్రీ నంబర్ 0402111111కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఇదిలావుండగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా చూడాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్లు తమ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల పరిస్థితులు తెలుసుకోవాలని, వారిచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News