Monday, December 23, 2024

పంజాబ్‌లో 56 శాతం, హర్యానాలో 40 శాతం తగ్గిన వ్యర్ధాల దహనాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వ్యవసాయ వ్యర్ధాల దహనం సంఘటనలు గత ఏడాదితో పోల్చుకుంటే సెప్టెంబర్ 15 నుంచి పంజాబ్‌లో 56 శాతం, హర్యానాలో 40 శాతం వరకు తగ్గాయని డేటా చెబుతోంది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 29 మధ్యకాలంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ , ఉత్తర ప్రదేశ్ లోని ఎన్‌సిఆర్ ఏరియాల్లో వ్యర్థాల దగ్ధాల సంఘటనలు 2022 లో 13,964 జరగ్గా, 2023లో 6391 కు తగ్గాయని సెంటర్స్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సిఎక్యుఎమ్) వెల్లడించింది. 2021లో 11,461 వ్యర్ధాల దహనాలు జరిగాయని పేర్కొంది.

ఈ 45 రోజుల వ్యవధిలో గత రెండేళ్లతో పోల్చుకుంటే పంజాబ్‌లో 5254 వ్యర్థాల దహనాలు మాత్రమే జరిగాయని వివరించింది.ఇదే కాలంలో 2022 లో 12,112, 2021లో 9001 వ్యర్థాల దహనాలు జరగడాన్ని ఈ నివేదిక ఉదహరించింది. ఇది క్రమంగా 56.6 శాతం, 41.6 శాతం వరకు తగ్గుదలను సూచిస్తుంది. ఇదే 45 రోజుల వ్యవధిలో హర్యానాలో 1094 దహనాలు మాత్రమే జరిగాయి. ఈ శీతాకాలంలో 50 శాతం వరకు పంట వ్యర్ధాల దహనాలను తగ్గించాలని పంజాబ్ ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News