Wednesday, January 22, 2025

బీఆర్‌ఎస్‌లోకి 50 కుటుంబాల చేరికలు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: బీఆర్‌ఎస్ పాలనలో సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు వడ్డెర కాలనీకి 50 కుటుంబాలు ఆదివారం నకిరేకల్‌లో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరుతున్న ప్రతి కార్యకర్తకు న్యాయం చేసేందుకు నిరంతరం ముందుంటానన్నారు.

వడ్డెర కులస్తులకు కాలనీలో కమ్యునిటీహాల్, స్మశానవాటిక తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి ఆయా పార్టీలకు చెందిన వారు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణలో ఎంతో అభివృద్ది జరిగి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటున్నారన్నారు.

పార్టీలో చేరిన వారిలో గోగుల సుదర్శన్, ఎల్లమ్మ, రూపాని సైదమ్మ, ఆలకుంట్ల వెంకన్న, ధనమ్మ, సంతోష, చంద్రయ్య, ఇద్దయ్య, వెంకటేష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News