Monday, December 23, 2024

అభివృద్ధితోనే బీఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: మారుమూల గ్రామాల అభివృద్ధితోనే వివిధ పార్టీల నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని నిమ్మనపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు గులాబీ గూటిలో చేరారు.

పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణాలతో గ్రామాల అభివృద్ధి జరిగిందన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు.

మరింత అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్‌కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పుల కుమార్, ఆకుల శ్రీనివాస్, మాధారపు వేణుగోపాల్‌రావు, ఆరేపల్లి వెంకట్రాజం, మర్రి రెడ్డి, పెర్క నవీన్, బుర్ర సంతోష కుంబాల నిరంజన్, మధారపు ప్రసాద్ రావు, బైరి హరీష్, వేల్పుల రాయమల్లు, ఇరుగురాల గట్టయ్యతోపాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News