Monday, January 20, 2025

ఆగవట్టినా.. ఆగంగాలె!

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో పాటిం చిన ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక నిర్వహణలో చేపట్టి న సంస్కరణల మూలంగా కేంద్ర ప్రభుత్వం సృ ష్టించిన అనేక సమస్యల నుంచి ఆలవోకగా బయ టపడ్డామని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. 2022-23వ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభు త్వం బాహాటంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సృష్టించినన్ని సమస్యలు దేశంలోని మరే ఇతర రాష్ట్రానికి కూడా కలిగించలేదని కొందరు సీనియ ర్ అధికారులు వివరించారు. కేంద్రం నుంచి తె లంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపినా, రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోయినా, చివరకు రుణాల రూపంలో నిధుల సమీకరణ ను అడుగడుగునా అడ్డుకున్నా, రాష్ట్రంలో అమ లవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధులు ఇ వ్వకపోయినా, రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన క్లియరెన్స్‌లు ఇవ్వకుండా అభివృద్ధి పనులకు ఆటంకాలు సృ ష్టించినా కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే విజయవంతంగా నిలదొక్కుతుందని,

అదే విధం గా తెలంగాణ రాష్ట్రం స్థానంలో మరే ఇతర రాష్ట్రం ఉన్నా… ఈ పాటికి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు పూ ర్తిగా సరెండర్ అయ్యి ఉండేవారని ఆ అధికారులు వివరించారు. ఒకవైపు ఆర్థికంగా రాష్ట్రాన్ని దె బ్బతీస్తూ, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇతర ఆదాయ మార్గాలను కూడా మూసివేసే ప్ర యత్నాలు చేసిన కేంద్రాన్ని ధీటుగా ఎదుర్కొంటూ నే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ని రాటంకంగా కొనసాగించామని ఆ అధికారులు ధీ మాగా చెబుతున్నారు. అందుకే 2022-23వ ఆర్థి క సంవత్సరంలో పాటించిన ఆర్థిక క్రమశిక్షణ, నిధుల వ్యయంలో పారదర్శకత, ప్రయారిటీ (ప్రా ధాన్యతలు)లనే ప్రస్తుత ఆర్థ్ధిక సంవత్సరం (2023-24)లోనూ కొనసాగించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారని ఆ అధికారులు వివరించా రు. రాష్ట్ర ప్రభుత్వానికి సొంత ఆదాయం, ప న్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, రు ణాలు, కేంద్రం వచ్చిన వాటా నిధులు, గ్రాంట్- నిధులు అన్నీ కలు పుకొని ఖజానాకు 2,37,884 కోట్ల 55 లక్షల రూపాయలు వచ్చా యని తెలిపారు.

ఇందులో 2,37,611 కోట్ల 53 లక్షల రూ పాయలను ఖర్చు చేశామని, ఇంక నూ 273 కోట్ల రెండు లక్షల రూపాయల నిధులు గత ఆర్థిక సంవత్సరంలో మిగిలాయని ఆ అధికారులు వివరించారు. ఇదంతా కూడా రా ష్ట్ర ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక క్రమశిక్షణతోనే సాధ్యమైందని ఆ అధికారులు వివరించారు. అ యితే ఈ ఆర్థ్ధిక సంవత్సరంలో మరిన్న ఘన విజ యాలు సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యాలు ఏమిటో, ఏ విధంగా తెలంగాణకు అన్యాయం చేసిందో గత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే చేపట్టిందని, దాంతో కోలుకోవడానికి నాలుగు నెలల సమయం వృథా అయ్యిందని,
దాంతో 2022 సెప్టెంబర్ నెల నుంచి చేపట్టిన ఆర్థిక సంస్కరణల మూలంగా సత్ఫలితాలను సాధించామని, భారీగా నష్టాలను చవిచూసిన ఖజానాను సొంత ఆదాయంతోనే భర్తీ చేసుకొంటూ వచ్చామని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఎలాంటి అదనపు పన్నులు వేయకుండానే,

ఇతరత్రా రూపాల్లో ప్రజల నుంచి నేరుగాకానీ, పరోక్షంగా కానీ ఎలాంటి నిధుల వసూళ్లను చేపట్టకుండానే ప్రత్యామ్నాయ మార్గాల్లోనే ఖజానా లోటును భర్తీ చేశామని వివరించారు. అందుకే 2022-23వ ఆర్థిక సంవత్సరంలో 2,37,611 కోట్ల 53 లక్షల రూపాయల నిధులను ఖర్చు చేయగలిగామని, ఇదొక రికార్డని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లు, రైతుబంధు, దళితబంధు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తులను ఇస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం సుమారు 40 వేల కోట్ల రూపాయల వరకూ గండికొట్టిందని, అయినప్పటికీ నిలదొక్కుకున్నామని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం 1,10,592 కోట్లు వచ్చిందని వివరించారు. జిఎస్‌టి పన్నుల ఆదాయాన్ని భారీగా పెంచుకోగలిగామని, తెలంగాణలోని ప్రజలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, ఐటి కంపెనీలు, ఫార్మా కంపెనీలు, వాణిజ్య వర్గాలు నిజాయితీగా పన్నులు చెల్లించడంతోనే జిఎస్‌టి ఆదాయం పెరిగిందని వివరించారు. ఎక్కడా లూప్‌హోల్స్ లేకుండా పన్నుల విధానాన్ని పర్‌ఫెక్ట్‌గా అమలు చేయడంలో కమర్షియల్ ట్యాక్స్ విభాగం సమర్థవంతంగా పనిచేసిందని ఆ అధికారులు వివరించారు. అంతేగాక కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఇఐయు)ను నెలకొల్పడం మూలంగా పన్నుల ఆదాయం పెరిగిందని వివరించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం నుంచి ఊహించిన దానికంటే ఎక్కువగానే ఆదాయం వచ్చిందని, భూముల మార్కెట్ వ్యాల్యూ (విలువ) హేతుబద్ధీకరించడం (రేషనలైజేషన్)తో రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగిందని వివరించారు.

ఇదిలా వుండగా నాన్-ట్యాక్స్ రెవెన్యూ విభాగంలో కూడా అనేక సంస్కరణలు చేపట్టడంతో మరింత ఆదాయం పెరిగిందని ఆ అధికారులు వివరించారు. గనులు, మినరల్స్ విభాగంలో రాయల్టీలు, సీనరేజీల వసూళ్లల్లో ఎక్కడా లూప్‌హోల్స్ లేకుండా వసూలు చేయడంతో ఆదాయం పెరిగిందని వివరించారు. రాష్ట్రంలోని గనుల వేలంలో హేతుబద్ధ్దీకరణను చేపట్టడం మూలంగా ముఖ్యంగా బొగ్గు, గ్రానైట్, ఇసుక తదితర గనుల కేటాయింపుల్లో బహిరంగ వేలం నిర్వహించడం మూలంగా కూడా ఆదాయం పెరిగిందని వివరించారు. అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను కబ్జాలు చేసిన వ్యక్తుల నుంచి ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని అమ్మడం మూలంగా వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. రాజీవ్ స్వగృహ ప్రాజెక్టులో ఉన్న భూములను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) పక్కనే 158 కిలోమీటర్ల పొడవునా భూములున్నాయని, వాటిని హౌసింగ్ కాలనీలుగా అభివృద్ధి చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వేలాది కోట్ల రూపాయల ఆదాయం కూడా వస్తుందని ప్రతిపాదించామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం కొట్టిన దొంగదెబ్బకు డీలా పడిపోకుండా ప్రభుత్వ పాలనలో ఖర్చులను తగ్గించుకుంటూ, రాష్ట్రంలో అమలులో ఉన్న అభివృద్ధి-, సంక్షేమ పథకాల ప్రాధాన్యతలను మార్చుకొంటూ నిధులను ఖర్చు చేశామని, అందుకే జాతీయ-, అంతర్జాతీయంగా బహుళ ప్రాచుర్యం పొందిన రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, దళితబంధు పథకాలను పూర్తి చేయగలిగామని వివరించారు. దీనికితోడు ప్రభుత్వ శాఖలను కూడా హేతుబద్దీకరణ చేసి ఖర్చులు తగ్గించుకొన్నామని, అందులో భాగంగానే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖను రోడ్లు-, శాఖలో విలీనం చేయడంతోనూ కోట్ల రూపాయల నిధులను ఆదా చేసుకున్నామని తెలిపారు. ఈ వ్యూహాన్నే ప్రస్తుత 2023-24వ ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగిస్తామని, గత ఏడాది కంటే మరిన్ని ఎక్కువ విజయాలు సాధిస్తామని అధికారులు ధీమాగా చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News