Monday, December 23, 2024

పెండింగ్ చలాన్ల ఆదాయం రూ. 135 కోట్లు

- Advertisement -
- Advertisement -

31తో ముగియనున్న గడువు
పొడిగించే ప్రసక్తే లేదు
పోలీస్ శాఖ స్పష్టీకరణ

మన తెలంగాణ/ సిటీబ్యూరో: రాయితీ పెండింగ్ చలాన్ల చెల్లింపు గడువును పెంచేది లేదని పోలీసు శాఖ స్పష్టం చేసింది. పోలీస్ శాఖ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు టూవీలర్లు, త్రీవీలర్లు, కార్లు తదితరాలకు రాయితీ ప్రకటించింది. దీంతో వాహనదారులు భారీ ఎత్తున పెండింగ్ చలా న్లు చెల్లించారు. దీంతో చలాన్ల చెల్లింపుతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. 3.59 కోట్ల పెండింగ్ చలాన్లకు గాను ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,52,47,864 చలాన్లను చెల్లించారు.

వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.135 కోట్ల ఆదాయం వచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రూ.34 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.25 కోట్లు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రూ.16 కోట్లు ఆదాయం వచ్చింది. రాయితీపై చలా న్లు చెల్లించేందుకు గడువు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉందని, పెండింగ్ చలాన్లను వెంటనే చెల్లించాలని పోలీసులు కోరుతున్నారు. గడువును మ రోసారి పొడిగించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. గతేడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి పెం డింగ్ చలాన్లను చెల్లించేందుకు 15 రోజులు అవకాశం కల్పించిన ప్రభుత్వం సాంకేతిక సమస్యలు రావడంతో గడువును జనవరి 31వ తేదీ వరకు పొడిగించారు. దానిని పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News