Wednesday, January 22, 2025

నిధులపై మథనం

- Advertisement -
- Advertisement -

Income should increase without burden

భారం మోపకుండా ఆదాయం పెరగాలి

కేంద్రం నిర్వాకంతో రూ.30 వేల కోట్ల లోటు రూ.30వేల
కోట్ల ఆదాయానికి మార్గాల అన్వేషణ పన్నులు వేయకుండా
ఆదాయాన్ని పెంచాలి సొంత ఆదాయం రూ.2.10 లక్షల
కోట్లు? మంత్రివర్గ ఉప సంఘం భారీ కసరత్తు

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ నిర్వాకం తో రాష్ట్రానికి రావాల్సిన నిధులు భారీగా తగ్గిపోవడంతో అదనంగా ఆదాయాన్ని సముపార్జించుకోవడానికి రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం సోమవారం భారీగా కసరత్తులు చేసింది. అయితే ఖజానాకు ఉన్న లోటు భర్తీ చేయడం కో సం రాష్ట్ర ప్రజలపై ఎలాంటి అదనపు భారం మోపకుం డా, పన్నులు పెంచకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలని మంత్రులు హరీశ్‌రావు, కె.తారకరామారావులు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ ఏడాది 2022-23వ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయం రూ. 1,93,029 కోట్ల వరకు ఉండవచ్చునని బడ్జెట్ సమయం లో అంచనా వేసిన ప్రభుత్వానికి అనూహ్యంగా ఈ ఆర్థ్ధిక సంవత్సరం ముగిసే నాటికి ఏకంగా రూ.2.10 లక్షల కోట్ల ఆదాయం సమకూరనుందని ఉన్నతాధికారులు భా విస్తున్నారు.

అయితే ఈ ఏడాది మొత్తం బడ్జెట్ రూ. 2,56,958 కోట్లకు ప్రవేశపెట్టగా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ ఆగిపోవడంతో రాష్ట్ర సొంత ఆదాయంపైనే ప్రభుత్వాన్ని నడుపుకొంటూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేయాల్సి రావడంతో నిధుల కొరత సమ స్య తలెత్తిందని, ఆ కొరతను భర్తీ చేసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని మంత్రివర్గ ఉపసం ఘం సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. లోటుగా ఉన్న రూ.30 వేల కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని రెవెన్యూ ఉన్నతాధికారులను మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించినట్లు తెలిసింది.

ఇప్పుడు రాష్ట్రంలో అ మలవుతున్న పన్నులు, సెస్, ఛార్జీలకే ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారని, కేంద్రం పెట్రోల్-, ధరలను రె ట్టింపు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీంతో అదనపు పన్నులు వేయకుండా అదనపు ఆదాయా న్ని సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయం తో ఉందని కొందరు అధికారులు వివరించారు. అందులో భాగంగానే తాము కసరత్తులు చేస్తున్నామని తెలిపారు. వాస్తవానికి ఎఫ్‌ఆర్‌బిఎం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.45వేల కోట్ల వరకూ రుణాలను తెచ్చుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం అప్పులు 23.5 శాతానికి కూడా మించలేదు. కానీ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికే అనేక రకాలుగా అడ్డంకులు సృష్టిస్తోంది. దీంతో రుణాలు ఇచ్చే ఆర్థిక సంస్థలు ఉన్నప్పటికీ కేంద్రం అనుమతులు ఇవ్వకుండా అనేక వేధింపులకు గురిచేస్తుండడంతోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పాలన, ఉద్యోగుల జీతాలకు… ఇలా ఒక్కటేమిటీ అన్నింటికీ రాష్ట ప్రభుత్వం సొంత ఆదాయంపైనే ఆదారపడి ముందుకు సాగాల్సి వచ్చిందని వివరించారు.

దేశంలో మరే ఇతర రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఛాలెంజ్‌లను ఎదుర్కోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు, అండదండలున్న రాష్ట్రాలు ఎఫ్.ఆర్.బి.ఎం.చట్టాన్ని అతిక్రమించి సగటున 42 శాతం వరకూ అప్పులు తెచ్చుకొంటున్నప్పటికీ కేంద్రం అనుమతులు ఇస్తూనే ఉందని, కానీ తెలంగాణ రాష్ట్రం ఎఫ్.ఆర్.బి.ఎం.చట్టానికి లోబడి అప్పులు కేవలం 23.5 శాతానికే పరిమితమైనప్పటికీ రుణాల సేకరణకు కేంద్రం అనుమతులు ఇవ్వడంలేదని, అందుకే మన రాష్ట్రానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. దీనికితోడు 2022-23వ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌లో పొందుపరిచినట్లుగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను అన్నింటినీ పూర్తిగా నిర్మించాలని కూడా ప్రభుత్వం లక్షంగా పెట్టుకొందని, దీనికి అవసరమైన నిధులను కూడా సిద్దంచేసుకోవాలని కూడా ప్రభుత్వ పెద్దలు ఆదేశించారని, అందుకే అదనపు వనరుల సమీకరణ కసరత్తులు చేపట్టామని ఆ అధికారులు వివరించారు.

14వ ఆర్ధిక సంఘం, 15వ ఆర్ధిక సంఘం సిఫారసులు, నీతి ఆయోగ్ సూచనలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి 34,149 కోట్ల రూపాయల నిధులు వచ్చేవని, కానీ కేంద్రం ఆ నిధులను ఇవ్వకుండా ఎగ్గొట్టడంతో రాష్ట్ర ఖజానాకు, బడ్జెట్‌లో పొందుపరిచిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత సమస్య తలెత్తిందని తెలిపారు. ఎలాగూ కేంద్రం మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిల్లో ఒక్క రూపాయిని కూడా ఇవ్వదని తేలిపోయిందని, అందుకే ప్రారంభించిన పథకాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాలంటే అదనంగా 30 వేల కోట్ల రూపాయల నిధులను సమకూర్చుకోవాల్సిందేనని, తామంతా ఆ పనిలోనే నిమగ్నమయ్యామని వివరించారు. ఈ ప్రయత్నాల్లో తాము ఎంతవరకూ సఫలీకృతమవుతామో ఈనెలాఖరు వరకూ వేచిచూడాలని ఆ అధికారులు అంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News