Sunday, December 22, 2024

ఆదాయపు పన్ను చట్టం సమీక్ష: సూచనలను కోరుతున్న ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను చట్టం1961పై ప్రయివేట్ రంగం, ట్యాక్స్ ఎక్స్ పర్ట్ ల నుంచి సూచనలను ఆహ్వానించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రత్యక్ష పన్నును మరింత సులభతరం చేయడానికే ఈ కసరత్తని అభిజ్ఞవర్గాల భోగట్టా. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సిబిడిటి) ఆరు దశాబ్దాల ప్రత్యక్ష పన్ను సమగ్ర సమీక్ష కోసం అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. ఇదంతా కొత్త చట్టం లేక కొత్త కోడ్ రాయడానికి మాత్రం కాదని మరొకరు అన్నారు. ఐటి చట్టం సమీక్ష ఉద్దేశ్యం బాషను మరింత సులభతరం చేయడం, వ్యాజ్యపు చిక్కులను తగ్గించడం అని తెలుస్తోంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులైలో 2024-25 బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఆ సమయంలో ఆరు నెలల్లో ఐటి చట్టం సమీక్షను పూర్తి చేస్తామని పేర్కొంది.  ఆ ఆరు నెలలు జనవరిలో పూర్తవుతాయి. కనుక సవరించిన ఐటి చట్టం ను పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో తీసుకొస్తారని భావిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News