Monday, December 23, 2024

దినసరి కూలీ రూ.14 కోట్లు పన్ను కట్టాలంటా…

- Advertisement -
- Advertisement -

 

పాట్నా: దినసరి కూలీకి ఐటి శాఖ నోటీసులు ఇవ్వడంతో అతడు షాక్‌కు గురయ్యాడు. నెలలో ముప్పై రోజులు కూలీ చేసుకుంటే కానీ గడవని తనకు ఐటి నోటీసు రావడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. బీహార్ రాష్ట్రం రోహ్తాస్ ప్రాంతంలో మనోజ్ యాదవ్ అనే వ్యక్తి కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నెల మొత్తం కూలీకి వెళ్తే రూ.12 వేల నుంచి రూ. 15 వేల వరకు మాత్రమే ఆదాయం వస్తుందన్నారు. మనోజ్ యాదవ్‌పై చాలా వ్యాపారాలు ఉన్నాయని, వాటిపై పన్నులు చెల్లించడం లేదని, మనోజ్‌కు 14 కోట్ల రూపాయలు పన్ను కట్టాలని ఐటి శాఖ నోటీసులు జారీ చేయడంతో అతడు అవాక్కయ్యాడు. అసలు తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, కూలీ పని తప్పితే ఎలాంటి వ్యాపారాలు చేయలేదని చెప్పాడు. హర్యానా, ఢిల్లీ ప్రాంతాలకు కూలీ పనులకు వెళ్లినప్పుడు కాంట్రాక్టర్లు తన దగ్గర ఆధారా కార్డు, పాన్ కార్డు తీసుకున్నారని చెప్పాడు. కాంట్రాక్టర్లు అతడి పేరుపై కంపెనీలు స్థాపించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐటి అధికారుల తప్పిదంతోనే తనకు నోటీసులు వచ్చి ఉంటాయని అతడు వాపోతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News