- Advertisement -
ఢిల్లీ: రూ.7 లక్షలు ఆదాయం లోపు ఉన్నవారికి కేంద్ర బడ్జెట్‌లో ఊరట లభించింది. పన్ను శ్లాబులను ఐదు వరకు తగ్గించారు. ఆదాయపు పన్ను రిబేట్ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచారు. తొమ్మిది లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు 45 వేలు పన్ను చెల్లించానున్నారు. స్టాండర్ట్ డిడక్షన్ రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. రూ.3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదన్నారు. రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఐదు శాతం పన్ను, రూ6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు పది శాతం పన్ను, రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను పడనుంది. రూ.30 లక్షల దాటితే 30 శాతం పన్ను విధించనున్నారు.
- Advertisement -