- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని సిజివొ టవర్స్ 8వ అంతస్థు నుంచి దూకి ఆదాయపు పన్ను ఇన్‌స్పెక్టర్ జయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఇది గమనించిన సెక్యూరిటీ వెంటనే గాంధీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. క్లూస్ టిం ఆధారాల కోసం గాలించారు. అనారోగ్య సమస్యలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటారు అని ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -