చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు రోజులకు ముందు ప్రతిపక్షనేతలు, వారి బంధువుల ఇళ్లపై ఐటి దాడులు జరుగుతున్నాయి. డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ కూతురు ఇంట్లో ఐటి అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. చెన్నైలోని నాలుగు ప్రాంతాల్లో ఐటి అధికారులు సోదాలు చేశారు. స్టాలిన్ అల్లుడు సబరీసన్ సంభందించిన ఆఫీసుల్లో ఉదయం 8 గంటలకు నుంచి సోదాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఐటి దాడులు జరగడం సంచలనంగా మారింది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని డిఎంకె ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఐటి దాడులపై స్టాలిన్ స్పందించారు. తాను కలైంగర్ కరుణానిధి కొడుకునని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేయిస్తున్న ఐటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని స్టాలిన్ స్పష్టం చేశారు. భయపడేందుకు”ఇది అన్నాడిఎంకే కాదు.. డిఎంకే” అని స్టాలిన్ పేర్కొన్నారు. ”నా కూతురు ఇంటిపై ఐటి దాడులు చేశారు. ఇలాంటి దాడులు ఎన్నో చూశాను” అని ఆయన తెలిపారు. పెరంబలూర్‌లో జరిగిన ర్యాలీలో స్టాలిన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
బిజెపి బెదిరింపులకు భయపడను: స్టాలిన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -