Monday, December 23, 2024

దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ దాడులు

- Advertisement -
- Advertisement -

‘పుష్ప’ బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని రూపొందించిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ కార్యాలయాలపై ఐటీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ కార్యాలయాల్లో, తన నివాసంలోనూ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ అన్న విషయం తెలిసిందే. పెద్ద స్టార్‌లతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తోంది. పంపిణీ సంస్థను కూడా నడుపుతోంది. బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్ ఐటీ తనిఖీలు చేస్తోంది. అప్రకటిత ఆస్తులు, నిధుల కోసం ఐటీ అధికారుల బృందాలు తెల్లవారుజాము నుంచి విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నాయి. సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి తీసిన ‘పుష్ప’ విజయవంతమైంది. ప్రస్తుతం సీక్వెల్ అయిన పుష్ప-2ని కూడా నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News