Sunday, January 19, 2025

డిస్టిలరీపై ఐటి దాడులలో రూ. 200 కోట్ల నగదు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఒడిశాకు చెందిన ఒక డిస్టిలరీ గ్రూపుతోపాటు దాని అనుబంధ సంస్థలపై ఆదాయం పన్ను శాఖ నిర్వహిస్తున్న దాడులలో లెక్కల్లో చూపని దాదాపు రూ. 250 కోట్ల నగదు లభించినట్లు అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. బౌధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాలలో బుధవారం ప్రారంభమైన దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు రూ. 200 కోట్ల మేరకు నగదును ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ. 250 కోట్ల వరకు నగదు లభించనున్నట్లు వర్గాలు తెలిపాయి. సోదాలలో జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహుకు ఉన్నట్లు వారు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న నగదు కట్టలను లెక్కించడానికి మూడు డజన్ల కౌంటింగ్ మిషన్లను తెప్పించామని, ఈ మిషన్లకు లెక్కించే సామర్ధం పరిమితంగా ఉండడంతో కౌంటింగ్ నిదానంగా సాగుతోందని వర్గాలు వివరించాయి. బలంగీరి జిల్లాలోని డిస్టిలరీ గ్రూపునకు చెందిన ప్రాంగణాలపై దాడులు నిర్వహించగా బీరువాలలో దాచిన రూ. 200 కోట్ల నగదు లభించిందని, మిగిలిన నగదు ఒడిశాలోని సంబల్‌పూర్, సుందర్‌గఢ్, జార్ఖండ్‌లోని బొకారో, రాంచి, బెంగాల్‌లోని కోల్‌కతాలో లభించిందని వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News