Friday, November 8, 2024

ఆదాయం పన్ను రాయితీ వల్ల తెలంగాణకు ఉపయోగం లేదు: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఆదాయం పన్ను రాయితీని రూ. 7లక్షలకు పెంచడం వల్ల తెలంగాణ ప్రజలకు లభించే ఉపయోగం ఏమీ ఉండదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. ఇది మోడీ ప్రభుత్వ వైఫల్యానికి సంబంధించిన అంకెల గారడీ బడ్జెట్ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

ఇది కొన్ని రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన బడ్జెట్‌గా ఆమె అభివర్ణించారు. ఆదాయం పన్ను రాయితీని రూ. 10 లక్షల వరకు పెంచుతారని తాము ఆశించామని, తెలంగాణలో ప్రజలకు జీతాలు చాలా ఎక్కువ ఉన్నాయని, రూ. ఆదాయం పన్ను రాయితీ 10 లక్షలు పెరిగితే తెలంగాణ ప్రజలకు ఉపయోగ పడుతుందని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు, బిజెపి పాలిత రాష్ట్రాలకు మాత్రమే అభివృద్ధి ప్రాజెక్టులను బడ్జెట్‌లో ప్రకటించిందని కూడా కవిత విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News