- Advertisement -
న్యూఢిల్లీ : ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1.79 కోట్ల పన్ను చెల్లింపుదారులకు రూ. 1.62 లక్షల కోట్లకు పైగా రీఫండ్‌లను జారీ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. దీనిలో 2020-21 అసెస్‌మెంట్ సంవత్సరానికి 1.41 కోట్ల రీఫండ్‌లు ఉండగా, వీటి మొత్తం రూ.27,111 కోట్లు ఉంది. 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 జనవరి 24 మధ్య కాలంలో 1.79 కోట్ల మంది ఓటర్లకు రూ.1,62,448 కోట్లకు పైగా రీఫండ్‌లను సిబిడిటి(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) జారీ చేసిందంటూ ఐటి శాఖ ట్వీట్ చేసింది. దీనిలో 1.77 మందికి వ్యక్తిగత ఐటి రిఫండ్ రూ.57,754 కోట్లు, కార్పొరేట్ టాక్స్ రిఫండ్ రూ.1.04 కోట్లు ఉంది. రీఫండ్ అందకపోతే, ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ద్వారా తనిఖీ చేయవచ్చు.
- Advertisement -