Wednesday, January 22, 2025

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయండిలా…

- Advertisement -
- Advertisement -

 

ITR filing

ముంబై: 2021-22 ఆర్థిక సంవత్సరానికి(అసెస్‌మెంట్ ఇయర్ 2022-23కు) ఆదాయపు పన్ను రిటర్ను(ఐటిఆర్) దాఖలు చేయడానికి ఇంకా కొన్ని రోజుల గడువు మాత్రమే ఉంది. మీరు మీ స్వంతంగా లేక ఎక్స్‌పర్ట్‌ల సేవల ద్వారా మీ ఆదాయాన్ని లెక్కించి, రిటర్నును రూపొందించి దాఖలు చేయవచ్చు. ఈ నిపుణులలో ప్రభుత్వం ఆమోదించిన సర్వీస్ ప్రొవైడర్లు, ప్రయివేట్ ఇంటర్మీడియరీలు, ఛార్టెడ్ అకౌంటెంట్లు ఉంటారు. ఏది ఎలా ఉన్నా మీ ఆదాయపు పన్ను రిటర్నులను గడువు తేదీకి ముందుగానే దాఖలు చేయాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఆదాయపు పన్ను శాఖ వివిధ సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తోంది. ఆదాయపు పన్ను రిటర్నులను చాలా వరకు ఆన్‌లైన్‌లోనే జరుగుతోంది, ఏవో కొన్ని కేసులు మినహాయిస్తే. ఒకవేళ మీరు జీతగాళ్లయితే, జీతం తప్పించి వేరే ఆదాయపు వనరులు మీకు లేకుంటే మీరు ఐటి డిపార్ట్‌మెంట్ ఈఫైలింగ్ పోర్టల్ (www. incometax.gov.in) ద్వారా రిటర్నులు సమర్పించొచ్చు. 80 ఏళ్లున్న లేక పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్‌లు ఐటిఆర్-1 లేక ఐటిఆర్4లో రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది. వారు పేపర్ ఫారమ్‌లో కూడా రిటర్నులను దాఖలు చేయొచ్చు.

ఆన్‌లైన్‌లో ఐటిఆర్ దాఖలు చేయడానికి మీరు మొదట ఖాతాను సృష్టించుకోవాలి. యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ను రూపొందించుకోవాల్సి ఉంటుంది. అందుకు మీ పర్మనెంట్ ఖాతా నంబర్(పాన్) వివరాలు అవసరం. మీరు మీ ఖాతాను సృష్టించుకున్నాక మీరు ఆన్‌లైన్ ద్వారానే ఐటిఆర్‌ను దాఖలు చేయొచ్చు.

ఇలా కుదరనప్పుడు మీరు రెండో ఐచ్ఛికం ద్వారా రిటర్నులు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు మీరు సరైన ఐటిఆర్ ఫారమ్ ఎంచుకుని వివరాలు నింపి ఆ ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. పై రెండు విధానాల్లో కూడా మీ రిటర్నుల దాఖలు విజయవంతం అయితే మీకో స్లిప్ జనరేట్ అవుతుంది. అయితే మీరు మీకు సరైన ఐటిఆర్‌ను ఎంచుకోవడం మరవొద్దు. దాఖలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించి చూసుకోవాలి.

ఆదాయపు పన్ను చెల్లించే వారికి, రిటర్నులు రూపొందించడంలో సాయపడేందుకు ప్రభుత్వం టాక్స్ రిటర్ను ప్రిపేరర్లను(టిఆర్‌పిలను) రూపొందించి వారికి శిక్షణనిచ్చింది. ఈ టిఆర్‌పి మీ రిటర్ను రూపొందించేందుకు గరిష్ఠంగా రూ. 250 ఛార్జ్ చేస్తాడు. ఆదాయపు పన్ను శాఖ కూడా టిఆర్‌పిలకు ప్రోత్సాహకాలు(ఇన్‌సెంటివ్స్) ఇస్తుంది. మీ ప్రాంతంలోనే టిఆర్‌పిలు అందుబాటులో ఉంటారు. ఇన్‌కమ్ టాక్స్ వెబ్‌సైట్‌లో కూడా వారి వివరాలు మీరు పొందవచ్చు. అందుకు మీరు వెబ్‌సైట్‌లోని ‘రీడ్ మోర్’ అనే దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందులో టాక్స్ ఇన్‌ఫార్మేషన్ అండ్ సర్వీసెస్ కాలమ్‌లో ‘లొకేట్ టిఆర్‌పి’ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు అడ్రస్, పిన్ కోడ్, జిపిఎస్ ఆధారంగా కూడా వారిని కనిపెట్టవచ్చు.

ఈఫైలింగ్ ఇంటర్మీడియటరీస్ ద్వారా కూడా మీరు ఈఫైలింగ్ దాఖలు చేయవచ్చు. అందుకు వారు రూ. 999 ఫీజుగా తీసుకుంటారు. మీరు జీతగాళ్లు అయితే మీ ఆదాయం కేవలం జీతం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేక సేవింగ్స్ అకౌంట్ల వడ్డీ మాత్రమే పొందుతున్నట్లయితే వారు మీకు బాగా ఉపయోగపడతారు. ఎవరికైతే విదేశీ ఆదాయం లేక క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయో వారికి ఈఫైలింగ్‌లో సాయపడినందుకు రూ. 5,999, రూ. 3999 మేరకు వారు ఛార్జీ చేస్తారు.
క్యాపిటల్ గెయిన్స్ ఉన్న వారికి, లేక స్వీయెపాధి ఉన్నవారు లేక వృత్తి నిపుణులు(ప్రొఫెషనల్స్) రిటర్నులు తయారు చేసేందుకు రూ. 3,000, రూ. 3,500 వరకు వసూలు చేస్తారు. ఐటిఆర్ సమర్పించే ప్రవాస భారతీయులకు ఐటిఆర్ సమర్పించడంలో సాయపడినందుకు రూ. 4,500 వసూలు చేస్తుంటారు.
ఒకవేళ మీ ఆదాయం వివిధ మార్గాల ద్వారా (మల్టీపుల్ సోర్సెస్) వస్తున్నట్లయితే, గణించడం అంతా మీకు గజిబిజిగా అనిపిస్తున్నట్లయితే మీరు ఛార్టెడ్ అకౌంటెంట్‌ను సంప్రదించడం మంచిది. వారు తప్పులు దొర్లకుండా మీ రిటర్నులను సమర్పిస్తారు. కొన్ని సందర్భాల్లో టాక్స్ ఆడిట్ కూడా అవసరమవుతుంది. బ్యాలెన్స్ షీట్ తయారు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు సిఏ తప్ప మరో గత్యంతరం ఉండదు. సాధారణంగా మామూలు రిటర్నులు దాఖలు చేయడానికి సిఏలు రూ. 5000 వరకు వసూలు చేస్తారు. మీరు చేసే వ్యాపారం, ఆదాయం గణింపులో ఉండే కాంప్లెక్సిటీలు ఎక్కువ ఉంటే వారు ఇంకా ఎక్కువ తీసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ మీ ఐటి రిటర్నును 2022 జూలై 31 కన్నా ముందే సమర్పించండి. మీరు స్వయంగా, లేక టిఆర్ పిలు, లేక ఈ-ఫైలింగ్ ఇంటర్మీడియరీలు,  లేక ఛార్టెడ్ అకౌంటెంట్ ద్వారా మీ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News