Wednesday, January 22, 2025

ఐటిఆర్ ఫైలింగ్: ఫారమ్ 16 గురించి తెలుసా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆదాయపు పన్ను రిటర్న్ ఆర్థిక సంవత్సరం 2022-23 (అసెస్‌మెంట్ సంవత్సరం 2022-23) తుది గడువు 31 జూలై 2023. ఆదాయపు పన్ను శాఖ ఐటిఆర్ 1 మరియు 4 ఆన్‌లైన్‌లో దాఖలు చేసుకునే వీలు కల్పించింది. ఐటిఆర్1ని వ్యక్తులు, శాలరీ వర్గం, సీనియర్ సిటిజెన్లు దాఖలు చేయవచ్చు. ఐటిఆర్4 ఫారమ్‌ను వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్), సంస్థలు(ఫర్మ్) అంటే లిమిటెడ్ లయబిలిటీ ఉన్న భాగస్వామ్య సంస్థలు రూ. 50 లక్షలకు వరకు మొత్తం ఆదాయం కలవారు దాఖలు చేయవచ్చు.
జీతం పొందే వ్యక్తులు సాధారణంగా ఫారమ్16 ద్వారా ఐటిఆర్ ఫైల్ చేస్తారు. కానీ అది ఎల్లప్పుడూ అవసరం కాదు.
అసలు ఫారమ్ 16 ఏమిటి?
యజమాని(ఎంప్లాయర్) మూలం వద్ద పన్ను కోసుకున్నప్పుడు ఈ ఫారమ్ 16ను సమర్పించాల్సి ఉంటుంది. శాలరీ వ్యక్తులకు ఐటిఆర్ ఫైలింగ్ చేయడంలో ఇది కీలకం కానున్నది. ఇందులో ఉద్యోగికి సంబంధించిన పూర్తి జీతభత్యాలు ఉంటాయి. ఇందులో ఉద్యోగి డిడక్షన్‌ను క్లెయిమ్ చేయవచ్చు. దాని ద్వారా పన్ను కోతను కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఫామ్‌లోని ఎ, బి భాగం
ఎ భాగం మీ యజమాని కోసిన టిడిఎస్ , పన్నుల కోత వివరాలను సమ్మరైజ్ చేసి చూపుతుంది.
ఫారమ్ 16 తాలూకు పార్ట్ బి జీతం రాబడి, ఉద్యోగి క్లెయిమ్ చేసే డిడక్షన్లు, పన్ను పడే ఆదాయం ప్రతిబింబిస్తుంది.
ఫారమ్ 16 ఎప్పుడు జారీ అవుతుంది?
ప్రతి జీతగాడు సాధారణంగా ఫారమ్ 16ను తమ యజమాని నుంచి అసెస్‌మెంట్ ఇయర్ తాలూకు జూన్ 15కల్లా పొందుతాడు. ఆదాయపు పన్ను చట్టం,1961 సెక్షన్ 203 ప్రకారం యజమానులు తమ ఉద్యోగులకు ఫారమ్ 16ను తప్పనిసరి ఇవ్వాలి. అందులో ఆదాయంపై మొత్తం టిడిఎస్ కోతను చూయించాలి.
ఐటిఆర్‌ను దాఖలు చేసేప్పుడు ఫారమ్16లో ఏమి చూడాలి?
ఐటిఆర్‌ను దాఖలు చేసేప్పుడు మీ శాలరీ స్లిప్‌తో ఫారమ్ 16ను సరిచూసుకోండి. ఎఐఎస్(యాన్యువల్ ఇన్‌ఫార్మేషన్ స్టేట్‌మెంట్), ఫారమ్ 26 ఎఎస్ తో సరిచూసుకోండి. శాలరీ తీసుకునే వ్యక్తులు ఐటిఆర్‌ను ఫైల్ చేసేప్పుడు ఫారమ్ 16లోని ఈ అంశాలపై ధ్యాస పెట్టాలి:
పాన్
మీరు ఫారమ్ 16ను సరిచూసుకునేప్పుడు పాన్ సరిగా మ్యాచ్ అయింది, లేనిది చూసుకోవాలి. ఒకవేళ పాన్ సరైనది కాకపోతే, మీ జీతం నుంచి డిడక్ట్ అయింది ఫారమ్ 26ఎఎస్‌లో ప్రతిబింబించదు, తద్వారా మీరు ఐటిఆర్‌ను ఫైల్ చేసుప్పుడు క్రెడిట్‌ను క్లయిమ్ చేసుకోలేరు.
వ్యక్తిగత వివరాలు
పాన్‌తో పాటు మీ పేరు, అడ్రస్, యజమాని టాన్(టాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నంబర్) కూడా సరిచూసుకోవాలి.
ఫారమ్ 16 పార్ట్ ఎ
ఫారమ్ 16లోని పార్ట్ ఎలోని పన్ను మినహాయింపు వివరాలను మీ ఫారమ్ 26ఎఎస్‌లోని సమాచారంతో పోల్చడం చాలా కీలకం, ఇది తీసివేయబడిన, చెల్లించిన పన్నులు, ఎఐఎస్ ఏకీకృత స్టేట్‌మెంట్.
ఫారమ్ 16 తాలూకు పార్ట్ బి
క్లుప్తంగా చెప్పాలంటే మీ యజమాని చెల్లించిన ఆదాయం చూయిస్తుంది ఇది. మీరు క్లెయిమ్ చేసే ఏవైనా పన్ను ఆదా తగ్గింపులు, మినహాయింపులు ఫారమ్ 16లో సరిగ్గా ప్రతిబింబిస్తున్నాయని నిర్ధారించుకోండి.
ఏవైనా తేడాలున్నాయేమో క్రాస్ చెక్ చేసుకోండి. తేడాలుంటే మీ యజమానికి తెలియజేయండి.
మీరు ఉద్యోగం మారితే, ప్రస్తుత యజమానికి ఆ విషయం తెలుపకుంటే మీరు అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని మరచిపోకండి. గత యజమాని వివరాలు ప్రస్తుత యాజమాన్యంకు తెలుపాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటరు దాఖలు చేసే ముందు ప్రతిది చెక్ చేసుకోండి.
ఫారమ్ 16 సమర్పించే ముందు ఉద్యోగులు క్యాపిటల్ గెయిన్స్ స్టేట్‌మెంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి వడ్డీ ఆదాయం, కిరాయి ఆదాయం, ఏవేని పెట్టుబడుల ఆదాయం వంటివి డిడక్షన్లను క్లెయిమ్ చేసుకోడానికి రెడీగా ఉంచుకోండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News