Wednesday, January 22, 2025

పూచీ.. పేచీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మరోసారి కొ రడా ఝుళిపించింది. రాష్ట్రాలు తీసుకునే రుణాలపై అనేక రకాల ఆంక్షలు విధిస్తూ వస్తున్న ఆర్‌బిఐ తాజాగా రాష్ట్రాల్లోని కార్పోరేషన్లు, సంస్థలు, ఎంటర్‌ప్రైజెస్‌లు అప్పుల రూపంలో నిధులను సేకరించుకోవడానికి ప్రభుత్వాలు ఇచ్చే గ్యారెంటీల(ష్యూరిటీ)పై అనేక ఆంక్షలు విధించింది. రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో పనిచేస్తున్న కార్పొరేషన్లు, ఎంటర్‌ప్రైజెస్‌లు, ఇతర అనేక సంస్థలు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి జా తీ య బ్యాంకులు, ఇతర ఆర్థ్ధిక సంస్థల నుంచి అ ప్పులు తెచ్చుకునేందుకు ఆయా రాష్టాల ప్రభుత్వాలు గ్యారెంటీలు ఇస్తేనే రుణాలు మంజూరు చేస్తున్నందున ఆయా కార్పొరేషన్లు చేసిన అప్పు ల భారమంతా రాష్ట్ర ప్రభుత్వాలపైనే పడుతోందని, దాంతో రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అభివృద్ధి,

సంక్షేమ కార్యక్రమాల అమ లు కుంటుబడుతోందని ఆర్‌బిఐ వర్కింగ్ గ్రూప్ తమ అధ్యయనంలో తేల్చింది. దీంతో ఆర్‌బిఐ రాష్ట్రాలు ఇచ్చే గ్యారెంటీలపై అనేక షరతులను విధించింది. కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇ చ్చే గ్యారెంటీలు ఆయా రాష్ట్రాల సొంత రెవెన్యూ వసూళ్లల్లో 5 శాతానికి మించకుండా మాత్రమే ఉండాలని, అంతేగాక ఆయా రాష్ట్రాల జిఎస్‌డిపిలో గ్యారెంటీ పరిధి కేవలం 0.5 శాతానికి మించకూడదని షరతులను విధించింది. అంతేగాక కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు చెల్లించలేకపోతే గ్యారెంటీలిస్తూ సంతకాలు చేసిన రాష్ట్రాల ప్రభుత్వాలే ఆ అప్పులు, వడ్డీలను చెల్లించాల్సి ఉంటుందని, అప్పుల రూపంలో తీసుకొన్న నిధులను తిరిగి చెల్లించలేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం నుంచే కోతలు విధించి అప్పులిచ్చిన ఆర్థిక సంస్థలకే చెల్లించాల్సి ఉంటుందని కూడా ఆర్‌బిఐ వర్కింగ్ గ్రూప్ తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చింది. అంతేగాక ఏదైనా ఒక కార్పొరేషన్ ఏ పథకానికైతే అప్పులు తీసుకోవడానికి ప్రతిపాదిస్తుందో ఆ పథకానికి అవసరమైన మొత్తం నిధుల్లో కేవలం 80 శాతం

నిధులకే రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారెంటీలు ఇస్తూ సంతకాలు చేయాలేగానీ మొత్తం ప్రాజెక్టు ఖర్చుకు సంతకాలు చేయకూడదని కూడా షరతు విధించింది. దీనికితోడు బడ్జెటేతర వాణిజ్య రుణాలకు రాష్ట్రాలు గ్యారెంటీలు ఇవ్వకూడదని కూడా ఆర్‌బిఐ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సైతం ఆదేశించింది. అంతేగాక ఏ కార్పొరేషన్ అయినా ప్రైవేట్ సెక్టార్ కంపెనీల నుంచి రుణాలను తీసుకొనడానికి ఉపక్రమిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారెంటీలు ఇవ్వకూడదని, ఇలా గ్యారెంటీలకు, వాటి వడ్డీలకు కేంద్ర ప్రభుత్వం 2022వ సంవత్సరంలో విడుదల చేసిన గ్యారెంటీల పాలసీకి లోబడి ఉండాలని కూడా ఆర్‌బిఐ వర్కింగ్ గ్రూప్ తన సిఫారసుల్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేషన్‌లకు ఇచ్చే గ్యారెంటీల ఉద్దేశ్యం కచ్చితంగా కేంద్రప్రభుత్వం 2017లో జారీ చేసిన జనరల్ ఫైనాన్షియల్ రూల్స్‌లోని 276వ నిబంధనకు లోబడి ఉండాలని, అంతేగాక ఆయా ప్రాజెక్టుల వయబిలిటీ, కార్యకలాపాలు కూడా నిబంధనలకు లోబడే ఉండాలని ఆదేశించింది.

ఇప్పటి వరకూ కార్పొరేషన్లకు కేవలం గ్యారెంటీలుగా సంతకాలు చేస్తూ వచ్చిన రాష్ట్రాలు తిరిగి చెల్లింపుల విషయానికొచ్చే సరికి ఇటు కార్పొరేషన్లు ఆర్ధికంగా నష్టాలు చూపిస్తూ అప్పులిచ్చిన జాతీయ బ్యాంకులు, ఆర్ధిక సంస్థలకు నిధులను చెల్లించడంలేదని, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడంలేదని, దాంతో కార్పొరేషన్లకు అప్పులిచ్చిన ఆర్థిక సంస్థలు నష్టపోతూ వస్తున్నాయని, ఈ సంస్కృతికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకే ఈ విధానాలను తీసుకొచ్చినట్లుగా ఆర్‌బిఐ వర్కింగ్ గ్రూప్ తన 62 పేజీల సిఫారసుల్లో విశదీకరించింది. కార్పొరేషన్లు అప్పులు చేయడానికి ష్యూరిటీ సంతకాలు చేసి చేతులు దులుపుకునే రాష్ట్రాలకు ఇదొక కనువిప్పు కలగాలని, అందుకే ఇలా కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చిందని కూడా ఆర్‌బిఐ వర్కింగ్ గ్రూప్ పేర్కొంది. వర్కింగ్ గ్రూప్ ఇచ్చిన సిఫారసులన్నింటినీ యథావిధిగా అమలుచేస్తూ వస్తున్న ఆర్‌బిఐ ఈ సిఫారసులను కూడా తప్పకుండా అమలుచేస్తుందని, ఇప్పటికే 95 శాతం సిఫారసులు అమలులోనే ఉన్నాయని, అందుకే టెన్షన్ పడుతున్నామని రాష్ట్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖలోని కొందరు

సీనియర్ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పులన్నీ ఒక లక్షా 30 వేల కోట్ల రూపాయల వరకూ ఉన్నాయని, అందులో కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, టిఎస్ ఆర్‌టిసి, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్‌లు తీసుకొన్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీలు ఇస్తూ వచ్చిందని, ఆర్‌బిఐ వర్కింగ్ గ్రూప్ ఇచ్చిన తాజా సిఫారసులతో రాష్ట్ర ప్రభుత్వాన్ని మరిన్ని ఇబ్బందులకు గురిచేసే విధంగానే ఉన్నాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2024-25వ ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఆర్‌బిఐ వర్కింగ్ గ్రూప్ ఇచ్చిన సిఫారసుల ప్రభావం తప్పకుండా ఉంటుందని ఆ అధికారులు వివరించారు. అయితే ఈ పరిస్థితుల నుంచి బయటపడాలన్నా, ఆర్ధిక సమస్యల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను పరిరక్షించుకోవాలన్నా కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిందేనని అంటున్నారు.

కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీలపై ఆంక్షలు విధించడం అంటే రాష్ట్ర ప్రభుత్వం అతిపెద్ద ఛాలెంజ్‌ను ఎదుర్కోవడమేనని ఆ అధికారులు అభిప్రాయపడ్డారు. ఖజానాకు వచ్చే సొంత ఆదాయంపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వ పన్నుల ఆదాయంలో వాటాలు తగ్గిపోవడం, మరోవైపు ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిలోనే రుణాలను సేకరించుకునే షరతులు చుట్టుముట్టడం, ఇంకోవైపు కార్పొరేషన్లు సేకరించే రుణాలపైన కూడా రాష్ట్రాలపై ఆంక్షలు విధించడం వంటి సమస్యలు చుట్టుముట్టాయని ఆ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యల పద్మవ్యూహం నుంచి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టాలన్నా, అమలులో ఉన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించాలన్నా,

ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా ఒకటో తేదీన ఠంఛనుగా జీతాలు చెల్లించాలన్నా కత్తిమీద సాములాంటిదేనని అంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ ఆర్థ్ధికశాఖలోనే కాకుండా ఆర్థ్ధిక నిపుణుల్లోనూ ఇదే చర్చ కొనసాగుతుందని, ఆర్ధిక సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చే వరకూ ఇలాంటి టెన్షన్ వాతావరణమే ఉంటుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News