Monday, December 23, 2024

మెదక్‌లో అసంపూర్తిగా మినీ ట్యాంక్ బండ్ నిర్మాణాలు

- Advertisement -
- Advertisement -

మెదక్ మున్సిపాలిటీ: 2016 మార్చి 14 రోజున స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి మిషన్ కాకతీయలో భాగంగా మెదక్ పట్టణంలోని గోసముద్రం, పిట్లం చెరువులను మినీ ట్యాంక్ బండ్‌గా మార్చటానికి తొ మ్మిది కోట్ల రూ.50 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగిందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజోద్దిన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంకుస్థాపన పూర్తయి దాదాపుగా ఏడు సంవత్సరాలు దాటిందని, కానీ ట్యాంక్ బండ్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉందన్నారు. మెదక్ పట్టణంతోపాటు ఇదే సమయంలో శంకుస్థాపన చేయబడ్డ సిద్దిపేటలోని కోమటిచెరువు ఈరోజు బోటింగ్, లైటింగ్, స్కైపింగ్, సై క్లింగ్, దాని చుట్టుపక్కల గార్డెన్‌తో కళకళలాడుతుందన్నారు. కానీ మెదక్ ప ట్టణంలో ఇంకా అసంపూర్తిగానే ఉందన్నారు. బోటింగ్ ఏర్పాటు చేయుటకు బోట్ కూడా ప్రారంభోత్సవం జరిగిందని, కానీ ఇప్పుడు ఈ బోటు ప్రజలకు ఉపయోగకరంగా లేదన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు నవీన్ చౌదరి, పుల్లబోయిన దుర్గేష్, జాకార్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News