Tuesday, November 5, 2024

పిల్లల హాజరుశాతం పెంచండి

- Advertisement -
- Advertisement -

చండ్రుగొండ : పాఠశాల్లో పిల్లల హాజరుశాతం పెంచాలని ఈ దిశగా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ ఉపాధ్యాయులకు సూచించారు. మండలకేంద్రం చండ్రుగొండలోని ప్రాథమికపాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతం తక్కువ ఉండటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. బడిబాట కార్యక్రమం మొక్కుబడిగా కాకుండా సమర్థవంతంగా నిర్వహిస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు.

పిల్లలు ప్రభుత్వ పాటశాల్లో చేరేలా తల్లిదండ్రులకు అవగాహన కల్నించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పిల్లలు ఉన్న ప్రతి ఇంటికీ వెళ్ళాలని ఆదేశించారు. పాఠ్యపుస్తకాలతోపాటు ఏకరూపు దుస్తులను విద్యార్థులకు పంపిణీ చేయాలని కోరారు. మధ్యాహ్న భోజనం రుచికరంగా ఉండేవిధంగా ప్రధానోపాధ్యాయులు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ఆనంద్‌కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News