Monday, November 18, 2024

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంధన ధరల పెరుగుదల: మంత్రి కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

దేశంలో ఎన్నికలు ముగిసిన తరుణంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంధన ధరలు పెరుగుతున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే అధిక ఇంధన ధరలు, అధిక ద్రవ్యోల్భణం, సామాన్య ప్రజలపై భారమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కర్నాటకలో ఇంధన ధరలను పెంచడంపై కిషన్ రెడ్డి ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంధన ధరలు పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు. కర్నాటకలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.44 ఉంటే

తెలంగాణలో రూ.109.41 ఉందని అదే బీజేపీ పరిపాలిస్తున్న గుజరాత్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.44, ఉత్తర ప్రదేశ్ లో రూ.94.70, ఉత్తరాఖండ్ లో రూ.93.82, హర్యానాలో రూ.95.46, గోవాలో రూ.95.36 ఉందని అన్నారు. కాగా కర్నాటక ప్రభుత్వం జూన్ 15 నుంచి పెట్రోల్, డీజిల్‌పై పన్ను పెంచిందని తెలిపారు. దీంతో ఇంధన ధరలు రూ.3 పెరిగాయి. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కర్ణాటక ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసిందని గుర్తు చేశారు. ఎన్నికలు ముగియగానే ప్రజలపై కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ భారం మోపుతోందని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News