- Advertisement -
ముంబై : రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి నాణేలపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచింది. గతంలో ఇది 11 శాతం ఉండగా, ప్రస్తుతం దీనిని 15 శాతానికి పెంచింది. కొత్త రేట్లు జనవరి 22 నుంచి అమల్లోకి వచ్చాయి. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ అనూజ్ గుప్తా ప్రకారం, దిగుమతి సుంకం పెరగడం వల్ల బంగారం ధరలు పెరగవచ్చు, అయితే ధరలు పెద్దగా పెరగబోవని అన్నారు.
- Advertisement -