- Advertisement -
న్యూఢిల్లీ : చిన్న మొత్తాల పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను 1.1 శాతం వరకు ప్రభుత్వం పెంచింది. పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లు, ఎన్‌ఎస్‌సి, సీనియర్ సిటిజన్ పొదుపు పథకాలకు వడ్డీ రేట్ల పెంపు 2023 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే పిపిఎఫ్(పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్), బాలిక పొదుపు పథకం సుకన్యా సమృద్ధిలకు వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు.
జనవరి 1 నుంచి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్(ఎన్‌ఎస్‌సి) వడ్డీ రేటు 6.8 శాతం నుంచి 7 శాతానికి పెరగనుంది. అదే విధంగా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ప్రస్తుత 7.6 శాతం నుంచి 8 శాతానికి పెరగనుంది. 1 నుంచి 5 సంవత్సరాల కాలానికి పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేట్లు 1.1 శాతం పెరగవచ్చు. నెలవారీ ఆదాయం పథకం 6.7 శాతం నుంచి 7.1 శాతానికి పెరగనుంది.
- Advertisement -