Monday, January 20, 2025

స్మాల్ సేవింగ్స్ పై వడ్డీ రేట్ల పెంపు

- Advertisement -
- Advertisement -
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు 8.20 శాతానికి పెంచిన ప్రభుత్వం
పిపిఎఫ్ పెట్టుబడిదారులకు మళ్లీ నిరాశ

న్యూఢిల్లీ : చిన్న మొత్తాల పొదుపుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2024 జనవరి నుంచి మార్చి కాలానికి గాను చిన్న మొత్తాల పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీ రేటు 0.20 శాతం పెంచి సుకన్య సమృద్ధి యోజన పెట్టుబడిదారులకు పెద్ద కానుకను అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఈ పథకం వడ్డీ రేట్లు 8 శాతం నుంచి 8.2 శాతానికి పెంచారు. దీంతోపాటు 3 సంవత్సరాల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని 7 శాతం నుండి 7.1 శాతానికి పెంచారు. అయితే ఇతర చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ముఖ్యంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పిపిఎఫ్ పెట్టుబడిదారులకు కేంద్రం మరోసారి నిరాశ మిగిల్చింది.

సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు రెండోసారి పెరిగింది. ఇంతకు ముందు 202324 మొదటి త్రైమాసికానికి సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లను 7.6 శాతం నుండి 8 శాతానికి పెంచారు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఈ పథకంపై వడ్డీ రేట్లను 0.6 శాతం పెంచింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్క్యులర్ ప్రకారం, 2024 జనవరి 1 నుండి 2024 మార్చి 31 వరకు పొదుపు డిపాజిట్లపై 4 శాతం వడ్డీ అందుబాటులో ఉంటుంది. ఏడాది టైమ్ డిపాజిట్‌పై 6.9 శాతం వడ్డీ, 2 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌పై 7 శాతం వడ్డీ, 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌పై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లపై 6.7 శాతం వడ్డీని కొనసాగించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News