Tuesday, January 28, 2025

తెలంగాణలోనే పెన్షన్ల పెంపు

- Advertisement -
- Advertisement -

నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట జిల్లా కేం ద్రంలో అంజన గార్డెన్‌లో జరి గిన దివ్యా ంగులకు రూ. 4,016 పించన్ వారికి ప్రోసిడింగ్ కాపీని ఎమ్మెల్యే ఎస్. రాజేందర్‌రెడ్డి అందజేశారు. ది వ్యాంగుల ఫించన్‌ను ప్రతినెలా రూ. 3,016 పెన్షన్ ను అందుకుంటున్న దివ్యాంగులు, ఈ పెంపుతో రూ. 4,0 16 పెన్షన్‌ను అందు కుంటున్నారు. మెదక్ వేదికగా దివ్యాంగులకు పించన్ పంపిణీ ప్రారంభించిన సీఎం కేసిఆర్ నారాయ ణపేట వేదికగా ఎమ్మెల్యే పంపిణీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అత్యధిక పించన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ఆసరా అవసరమైన దివ్యాంగులకు నేనున్నానంటూ ఆర్ధిక భరోసాగా అందిస్తున్న మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం మరింతగా పెంచిందన్నారు. ఈ కార్యక్రమం లో పట్టణ మండల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు , అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News