Monday, December 23, 2024

అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగాలి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

- Advertisement -
- Advertisement -

ఇటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌తో సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఇతోధికంగా పెరగాలని మంగళవారం రాష్ట్రపతి అన్నారు. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడుతూ..దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో అరుణాచల్ ముఖ్యపాత్ర పోషిస్తోందన్నారు. రాష్ట్రంపై అభివృద్ధి సూర్యుడు ప్రకాశిస్తున్నాడన్నారు. దేశ సమగ్ర అభివృద్ధికోసం ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యం ఎకువగా ఉండాలని సూచించారు. అరుణాచల్‌ప్రదేశ్‌తో సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, ఇతర ప్రజాప్రతినిధుల సంస్థల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని రాష్ట్రపతి కోరారు. అరుణా చల్‌ప్రదేశ్ భారత్‌లో ముఖ్యమైన భాగమని యాక్ట్ ఈస్ట్ పాలసీలో ప్రధాన వాటాదారు అని ముర్ము స్పష్టం చేశారు.

రోడ్డు, రైల్వే, విమాన కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఈశాన్య ప్రాంతాలు చాలాకాలంగా ఆర్థికాభివృద్ధికి దూరమైందన్నారు. ప్రస్తుతం కేంద్రం ఈ ప్రాంత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గొప్ప సహజ వనరులు, మానవ వనరులతో రాష్ట్రం ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉందని, వాణిజ్య కేంద్రంగా మారడానికి పూర్తి సామర్థాన్ని కలిగిఉందని అన్నారు. రాష్ట్ర విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేయాలని రాష్ట్రపతి ముర్ము శాసనసభ్యులను కోరారు. సంప్రదాయాలతో కూడిన అరుణాచల్‌ప్రదేశ్‌కు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని వాటిని సంరక్షించేందుకు కృషి చేయాలన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికిప్రత్యేక మంత్రిత్వశాఖను రూపొందించడంలో మాజీ ప్రధాని చేసిన రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. ‘నో యువర్ అసెంబ్లీ’ కార్యక్రమం కింద అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి విద్యార్థులను చట్టసభల పనితీరును తెలుసుకునేందుకు ఆహ్వానిస్తున్నారని ప్రశంసిస్తూ యువతరం తప్పనిసరిగా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని దేశప్రగతికి దోహదపడాలని రాష్ట్రపతి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News