మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి వచ్చాయి. పెరిగిన ధరలపై ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల బీర్లపై రూ.10 పెరిగాయి. రూ.200 ల లోపు ఎంఆర్‌పి ఉన్న 180 ఎంఎల్‌పై రూ.20, 375 ఎంఎల్‌పై రూ.40, 750 ఎంఎల్‌పై రూ.80 లు పెరిగాయి. ఎంఆర్‌పి రూ.200కు పై ఉన్న బ్రాండ్లపై 180 ఎంఎల్‌కు రూ.40, 375 ఎంఎల్‌కు రూ.80, 750 ఎంఎల్‌కు రూ.160 లు పెరిగాయి. వైన్ బ్రాండ్స్ పై 180 ఎం ఎల్ కు రూ.10, 375 ఎంఎల్‌కు రూ.20, 750 ఎంఎల్‌కు రూ.40లు పెరిగాయి. అన్ని రకాల బీర్ బాటిల్స్ ఎంఆర్‌పిపై రూ. 10 పెంచారు. గతంలో మే 2020 లో ప్రభుత్వం మద్యం ధరలు పెంచిన విషయం తెలిసింది. పాత ఎంఆర్‌పి ఉన్నా పెరిగిన ధరలు వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఎంఆర్‌పిను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సమస్యల పై ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెం. 1800 425 2523 ను ప్రకటించింది. బ్రాండ్, సైజ్ ల వారి ధరల జాబితాను www.tsbcl.telangana.gov.in/ts/ లో అందుబాటులో ఉంచారు.