Wednesday, January 22, 2025

హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్.. రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత భారీగా పెరిగింది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల చలితీవ్రత పెరిగింది. రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి అధికంగా ఉంది. పలు జిల్లాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. జనవరి 1 నుంచి చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టడంతో తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో డిసెంబర్ 28న ఎల్లో అలర్ట్ ప్రకటించింది. జిహెచ్‌ఎంసిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 15-17 డిగ్రీల సెల్సియస్‌ వరకు తగ్గే అవకాశం ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో, కాప్రాలో రేపు ఉదయం 8:30 గంటలలోపు హయత్‌నగర్, ఎల్‌బి నగర్‌లో 15 డిగ్రీల సెల్సియస్, హయత్‌నగర్, ఎల్‌బి నగర్‌లలో అత్యల్ప ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News