Thursday, January 23, 2025

రాష్ట్రం గజగజ

- Advertisement -
- Advertisement -

పెరిగిన చలి తీవత్ర
వైరల్ ఫీవర్లు, గొంతునొప్పి సమస్యలతో ఆస్పత్రులకు బాధితులు
ఏది కరోనానో.. సాధారణ జ్వరమో తెలియక ఆందోళన

రాత్రిపూట తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకు పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రెండు రోజుల క్రితంతో పోలిస్తే శనివారం, ఆదివారం రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల దిగువకు పడిపోయాయి. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణశాఖ అధి కారులు తెలిపారు. చలికి తోడుగా భారీ పొగ మంచు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండ్రోజుల పాటు రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో (10.7), కొమురం భీం ఆసిఫాబాద్ (11.2), మంచిర్యాల (13.6), నిర్మల్ (12.8), భద్రాద్రి కొత్తగూడెం (14.6), ఖమ్మం (14.9), రంగారెడ్డి (10.4), హైదరాబాద్ (14.4), మేడ్చల్ మల్కాజిగిరి (12.5), వికారాబాద్ (12.0), సంగారెడ్డి (12.1), మెదక్ (12.4), మహబూబ్‌నగర్‌లో (12.2), నాగర్‌కర్నూల్‌లో (11.7), రాజన్న సిరిసిల్లలో (12.7), యాదాద్రి భువనగిరి (12.8), జనగాంలో (13.6), నారాయణపేట (14.2), ములుగు (14.5), వనపర్తి (14.8), జోగులాంబ గద్వాల్ (15.2), సూర్యాపేట (16.1) జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉదయం వేళల్లో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పొగమంచు కారణంగా వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని అధికారులు సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News