మరింత బాధ్యతగా విధులు నిర్వర్తిస్తున్న వైనం
హైదరాబాద్ : ప్రజారవాణాలో కీలక పాత్ర పోషించే ఆర్‌టిసి బస్సులన్నా.. అందులో పని చేసే సిబ్బంది అన్నా.. అందరికి చులకనే. ఎవరికి ఆగ్రహం వచ్చినా బలయ్యేవి అవే.. దానికి కారణంగా వాటిని ఏమి చేసినా. అందులో పనిచేసే సిబ్బందిని ఏమన్నా. ఏమీ కాదనే ధైర్యం. ఒక వేళ ధైర్యం చేసి ఎవరైనా ముందకు వచ్చి తమకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు లేక పోవడంతో అన్నింటిని మౌనంగా భరిస్తూ వచ్చారు. అదంతా గతం.. ప్రస్తుతం సంస్థకు నష్టం వచ్చేపనులు చేసినా,సిబ్బంది దూషించే ఏ మాత్రం సహించేది లేదని చెప్పడమే కాకుండా చేసి చూపిస్తుండటంతో ఆర్‌టిసిలో పనిచేసే సిబ్బందిలో ఆత్మశ్వాసం పెరిగింది.
గత కొద్ది రోజుల క్రితం ఒక ప్రైవేట్ అడ్వర్టైజ్‌మెంట్‌లో సంస్థకు సంబంధించిన బస్సులను కించపరుస్తూ .. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేంచే విధంగా నటించిన ప్రముఖ హీరోకు ఎండి సజ్జాన్నార్ నోటీసులు జారీ చేశారు. ప్రజాప్రయోజనం కోసం పని చేస్తున్న తమ సంస్థను ఇబ్బందులకు గురిచ చేస అడ్వర్టైజ్‌మెంట్ నటించే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు. అదే విధంగా తమ వాహానానికి ఆర్‌టిసి బస్సు సైడ్ ఇవ్వలేదని ఎమ్మెల్యే అనుచురులు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని బూర్గుల గ్రామం వద్ద సదరు డైవర్‌ను దూషించిన సదరు ఎమ్యేల్యే అనుచరులపై కేసు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఎండి ఆదేశాలు జారీ చేశారు. అంతే నిబంధనలకు విరుద్దంగా సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదంటూ ఆయన హెచ్చరించారు. నగరంలో సిటీ బస్సు డ్రైవర్‌పై దురుసుగా
ప్రవర్తించిన ఒక వ్యక్తిపై
మోటార్ వాహన చట్టం 185 యక్ట్ 3 కింద కేసు నమోదు చేయాలని ఎండి సజ్జనార్ అధికారులను ఆదేశించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారు ఎటువంటి వారైన వదిలే ప్రసక్తే లేదని చెబుతున్నారు. అంతే కాకుండా సిబ్బందికి ఏదైనా ఆపద వచ్చినా ఆసుపత్రిల్లో అడ్మిట్ అయితే ఆయనే స్వయంగా వెళ్ళి పరామర్శిస్తున్నారు. అంతే కాకుండా సిబ్బందికి మరింత మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశిస్తున్నారు.
ఈ విధంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా తానున్నాంటూ వారికి మానసిక స్థైర్యాన్ని నింపుతున్నారు. తనకు సంస్థ,సిబ్బంది రెండు కళ్ళలాంటి వారని ఎవరికి ఏ కష్టం వచ్చినా వారిబాగోగులు స్వయంగా చూస్తున్నారు. అంతే కాకుండా ప్రయాణికులకు ఇబ్బంది కరంగా వ్యవహరించి సంస్థకు చెడ్డ పేరు తీసుకు వచ్చినా సహింది లేదని చెబుతున్నారు. ప్రయాణికులను ఎక్కేబస్సులను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత కూడా సిబ్బందికి ఉందని, బస్సులో సిబ్బంది పాన్,గుట్కాలాంటి వాటిని వినియోగిస్తూ అపరిశుభ్రవాతవరణం కలిగించినా సహించేది లేదని ఆయన సిబ్బందిని కూడా హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఎండిగా బాధ్యత స్వీకరించిన మొదలు ఇటు ఉద్యోగుల సమస్యలనే కాకుండా అటు ప్రయాణికులు సమస్యలను కూడా పరిష్కరిస్తూ సంస్థను మరింత అభివృద్ది పథంలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తుండటంలో అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.