Monday, January 13, 2025

కాళేశ్వరం లేకున్నా..సాగు భళా!

- Advertisement -
- Advertisement -

పెరిగిన సాగు విస్తీర్ణం..ధాన్యం
దిగుబడిలో రికార్డు ప్రాజెక్టుల
కింద పెరిగిన ఆయకట్టు ప్రాధాన్య
క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేసే
లక్ష్యం తొలి ఏడాదిలోనే
సాగునీటి రంగంలో కీలక మార్పులు
మన తెలంగాణ/హైదరాబాద్:వ్యవసాయ ప్రా ధాన్యతకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం తొలి ఏడాదిలోనే సాగునీటి రంగంలో కీలక మార్పు లు తీసుకువచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రె డ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కృష్ణా జలాల పంపిణీలో న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన వా టాను సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పె ట్టారు. బీఆర్‌ఎస్ హయాంలో పదేండ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన లోటుపా ట్లు, విధ్వంసకర పరిస్థితులపై ప్రజా ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేత పత్రం సమర్పించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. లక్ష కోట్లతో అప్పటి ప్రభుత్వం నిర్మించి కాళేశ్వరంలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు కుంగిపోయిన తీరు పై ప్రజా ప్రభుత్వం అసెంబ్లీలోనే చర్చకు పె ట్టింది. నీటిపారుదల రంగంలో పదేండ్లలో పెట్టి న ఖర్చులు, తెచ్చిన అప్పులు, ఆయకట్టు తీరుతెన్నులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిం ది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకలపై విచారణకు ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టులను రైతులకు అం దుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రాధాన్యమిచ్చింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కేంద్రీకరించారు.

నీలం వాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ స్టేజీ 2, సదర్మట్ ప్రాజెక్టులపై ముందుగా ఫోకస్ చేసింది. రూ.241 కోట్ల ఖర్చుతో దాదాపు 48 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేలా పనులు ప్రారంభించింది. 2025 మార్చి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. గోదావరి బేసిన్ లో ఉన్న చిన్న కాళేశ్వరం, మోదికుంట, లోయర్ పెన్ గంగా, చనాక కోరాట, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టు, కృష్ణా బేసిన్ లో కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, డిండి, ఎస్‌ఎల్బీసీ పనులు ఈ ప్రాధాన్యత జాబితాలో చేర్చింది. ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేసే దేవాదుల ఎత్తి పోతల ప్రాజెక్టుకు అవసరమైన 2,947 ఎకరాల భూసేకరణ చేపట్టి 89,312 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం మొట్టమొదటగా కొబ్బరికాయ కొట్టి అసంపూర్తిగా వదిలేసిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఆర్థిక సాయం అందించాలని అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు విజ్ఞప్తి చేశారు.

ప్రధానిమంత్రి కృషి సించాయి యోజన పథకంలో ఈ ప్రాజెక్టును చేర్చి ఆర్ధిక సాయం అందించాలని కోరారు. ఆగస్ట్ 15వ తేదీన ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించారు. గత ప్రభుత్వం రూ. 7400 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా నీళ్లు ఇవ్వకుండా వదిలేసిన ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం 482.87 కోట్లతో ఎనిమిది నెలల్లోనే పూర్తి చేసింది. 9 కిలోమీటర్ల రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా సీతారామ నీటిని నాగార్జునసాగర్ కెనాల్ కు అనుసంధానం చేసి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించటం రికార్డు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగునీటితో పాటు ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించే ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టును గత ప్రభుత్వం విస్మరించింది. ఎస్‌ఎల్‌బిసి పనులను ప్రజా ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. సాంకేతిక నిపుణులతో కమిటీ వేసి అత్యాధునిక యంత్ర పరికరాలను విదేశాల నుంచి తెప్పించింది. 2027 సెప్టెంబర్ లోగా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో రూ. 4,658 కోట్లు కేటాయించింది. 2014కు పూర్వం ప్రతిపాదించిన నారాయణపేట్- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు ఫిబ్రవరి నెలలోనే ప్రజా ప్రభుత్వం శంకుస్థాపన చేసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ తో పాటు మక్తల్, నారాయణపేట్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు, తాగునీటిని అందించే ఈ ప్రాజెక్టుకు రూ.4350 కోట్లు కేటాయించింది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు తో పాటు సీతారామ లిప్ట్, సమ్మక్క-సారక్క ప్రాజెక్టు కు అవసరమైన అనుమతులను తెచ్చుకునేందుకు ప్రభుత్వం కేంద్రంతో, మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గత ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బరాజ్ గతేడాది అక్టోబర్‌లో కుంగిపోగా అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో బుంగలు పడి ప్రమాదకర పరిస్థితి తలెత్తింది. లోపాలను గుర్తించి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యల బాధ్యతను నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్‌ఏ)కి అప్పగించింది. ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికలోని సిఫారసుల ఆధారంగా వానాకాలం ప్రారంభానికి ముందే బరాజ్‌లకు అత్యవసర మరమ్మతులు నిర్వహించింది. జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించింది.

రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక రికార్డు : కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రాష్ట్రంలో పంటల సాగువిస్తీర్ణం పెరిగిందని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. ఎన్డీఎస్‌ఏ సూచనల మేరకు ప్రభుత్వం ఈ ఏడాది మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లో చుక్క నీటిని నిల్వ చేయలేదు. కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండానే ఈ ఏడాది సాగునీటి ప్రాజెక్టుల కింద రికార్డు స్థాయిలో పంటలు సాగయ్యాయి. ఈ వానాకాలంలో 67 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 153 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరగడం విశేషం. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక రికార్డు. యాసంగిలో కూడా 42.11లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం ఇటీవలే సాగునీటి ప్రణాళికను విడుదల చేయడం గమనార్హం. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని, ఈ నీటిని వినియోగించేలా చేపట్టిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. నీటి వాటాలు, గోదావరి కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు ఇంతకాలం జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేయాలని అధికారం చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో అడుగులు వేస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 70 శాతం ఉండగా ఏపీలో కేవలం 30 శాతం ఉంది. అంతర్జాతీయ నీటి సూత్రాల ప్రకారం కృష్ణా జలాల్లోని 1005 టీఎంసీల్లో 70 శాతం రాష్ట్ర వాటా సాధించేలా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News