Saturday, November 23, 2024

కృష్ణాలో పెరిగిన వరద ప్రవాహం

- Advertisement -
- Advertisement -
Increased flood flow in Krishna
శ్రీశైలం ప్రాజెక్టుకు 81వేల క్యూసెక్కులు

హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం పుంజుకుంది. ఎగువనుంచి జూరాల జలాశయానికి 63,396క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా, ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తివేశారు. జూరాల ప్రాజెక్టులో జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనంతరం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలో నీటినిలువ 9.66టిఎంసీల గరిష్టస్థాయలో ఉండటంతో ప్రాజెక్టు నుంచి 64,605క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు కృష్ణానదితోపాటు ఆటు తుంగభద్ర నది నుంచి కూడా వరద ప్రహాహం గణనీయగా ఉండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ప్లో పెరుగుతూ వస్తోంది.

ప్రాజెక్టులోకి 81,296క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 59,678క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 55,795క్యూసెక్కుల ఇన్‌ప్లో వుండగా, సాగర్ జలాశయం నుంచి 49,966క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.మరోవైపు గోదావరి నదిలో కూడా వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. ఎగువ నుంచి శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి 13,625క్యూసెక్కుల నీరు చేరుతుండగా , జలాశయం నుంచి 12,885క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్‌ప్లో 11000క్యూసెక్కులు ఉండగా అంతే నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News