- Advertisement -
హైదరాబాద్: గత రెండు రోజులుగా కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర నదికి వరదనీటి ప్రవాహం పెరుగుతూ వస్తోంది. తుంగభద్ర ప్రాజెక్టు ఎగువన కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో జలాశయంలోకి 5765క్యూసెక్కుల వరదనీరు చేరుకుంటోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయ నీటి మట్టం 1633అడుగులు కాగా, ఆదివారం ఉదయానికి తుంగభద్ర పాజెక్టులో నీటిమట్టం 1595అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు దిగువన కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సుంకేసుల బ్యారేజికి వరదనీరు చేరుతున్నట్టు అధికారులు వెల్లడించారు. నిండు వేసవిలో కురుస్తున్న ఈ వర్షాలతో పొలాల్లో పచ్చిక పడి పశుగ్రాసం కొరత కొంతైనా తీరనుందని రైతులు చెబుతున్నారు. మరోవైపు తుంగభధ్రనదిలో నీటి ప్రవాహం పెరగటం వల్ల తాగునీటి కూడా ఇబ్బందులు వుండవని చెబుతున్నారు.
- Advertisement -