Wednesday, November 6, 2024

సైబరాబాద్‌లో పెరిగిన పోకిరీల ఆగడాలు

- Advertisement -
- Advertisement -

Increased Hooliganism in Cyberabad Limits

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోకిరీల సంఖ్య పెరిగింది. గతంలో కంటే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున షీటీమ్స్‌కు ఫిర్యాదుల సంఖ్య పెరిగింది. గత నెలలో సైబరాబాద్ షీటీమ్స్‌కు 154 ఫిర్యాదులు అందాయి. బస్‌స్టాప్‌లో వేధింపులు, ఫోన్ కాల్స్, సామాజిక మాధ్యమాలు, కామెంట్లు తదితరాల నుంచి వేధింపులకు గురయ్యారు. ఇందులో 43 మందిపై క్రిమినల్ కేసులు నమో దు చేశారు. 32 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. మిగతా వారికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. సైబరాబాద్ షీటీమ్స్ పోలీసులు కాలేజీలు, ట్యూటోరియల్స్, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, బస్‌స్టాప్స్ తదితర ప్రాంతాల్లో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో 366 అవగాహన సదస్సులు నిర్వహించారు. వీటికి 13,750 మంది ప్రజలు హాజరయ్యారు. 55 మందికి ఫోన్ చేసి ప్రవర్తన మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. మహిళలు, యువతులను ఎక్కువగా పోకిరీలు ఫోన్ ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారు. వేధింపులకు గురవుతున్న బాధితులు సైబరాబాద్ షీటీమ్స్ నంబర్ 9490617444కు మెసేజ్ లేదా ఫోన్ చేయాలని పోలీసులు కోరారు. సోషల్ మీడియా ద్వారా కూడా సంప్రదించవచ్చని అన్నారు.

బస్ డ్రైవర్ నుంచి మహిళలకు వేధింపులు

కూకట్‌పల్లికి చెందిన మరో బాధితురాలిని లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. బాధితురాలు వాట్సాప్ ద్వారా షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. నంబర్ తీసుకున్న పోలీసులు మహిళ వలే నిందితుడితో ఛాటింగ్ చేశారు. కర్నాటకకు చెందిన ఎల్లప్ప అలియాస్ రాజేష్ నగరంలోని మియాపూర్‌లో ఉంటూ బస్‌డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కావేరి ట్రావెల్ ఏజెన్సీలో ప్రయాణించిన మహిళల మొబైల్ నంబర్లను సేకరించి వారికి ఫోన్ చేసి వేధింపులకు గురిచేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఫోన్ చేసి నిందితుడు జాబ్ పెట్టిస్తానని, గోవా ట్రిప్పు తీసుకుని వెళ్తానని చెబుతున్నాడు. నిందితుడిపై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకుని అరెస్టు చేశారు.

వాకింగ్ వెళ్తే అసభ్య ప్రవర్తన

నిజాంపేటకు చెందిన మహిళ గత నెల 24వ తేదీన భర్తతో కలిసి వాకింగ్‌కు వెళ్లింది. లేక్‌వ్యూ కాలనీలో భర్తతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు మహిళ బైక్ సైడ్ కొట్టి పారిపోయారు. బాధితురులు షీటీమ్స్ కూకట్‌పల్లికి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించి ఇద్దరు నిందితులు బాచుపల్లికి చెందిన బళ్లా రాజేష్, నిజాంపేటకు చెందిన సయిద్ కరీముద్దిన్‌ను అరెస్టు చేశారు.

నర్సుకు వేధింపులు

హోంనర్సుగా పనిచేస్తున్న యువతితో సన్నిహితంగా ఉన్న ఫొ టోలు చూపించి లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న నిందితుడిని అరెస్టు చేశారు. బాలానగర్‌కు చెందిన నర్సుకు మర్రిబాబు అలియాస్ రిషి యా ద్‌తో పరిచయం ఏర్పడింది. బాబు తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇంటికి వచ్చి సర్వీస్ చేసేది. ఈ క్రమంలో బాధితురాలికి, బాబుకు ఏర్పడి పరియంతో కొద్ది రోజులు సన్నిహితంగా మెలిగారు. ఆ సమయంలో ఆమె బంగారు ఆభరణాలు, జీతం తీసుకున్నాడు. అలాగే ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలు చూపించి లైంగికంగా వేధింపులకు గురిచేశారు. దీంతో బాధితురాలు షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

మూడేళ్లలో 72 మొబైల్స్ నుంచి రిటైర్డ్ ఉపాధ్యాయురాలికి వేధింపులు

ఉద్యోగ విరమణ చేసిన కూకట్‌పల్లికి చెందిన ఉపాధ్యాయురాలిని గత 3 ఏళ్ల నుంచి 72 మొబైల్ నంబర్ల నుంచి ఫోన్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఫోన్ చేసి బూతులు తిడుతున్నాడు, అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్నారు. బాధితురాలు వేధింపులకు తట్టుకోలేక షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు అనంతపురానికి చెందిన దిగిం వెంకట నాయుడుగా గుర్తించారు. రచయితైన బాధితురాలి ఫోన్ నంబర్‌ను ఫేస్‌బుక్ ద్వారా సేకరించాడు. దానికి గ్రామంలోని వివిధ వ్యక్తులకు చెందిన ఫోన్ నంబర్ల ద్వారా ఫోన్లు చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. పోలీసులు ఆ గ్రామ సర్పంచ్‌కు దృష్టికి తీసుకుని వెళ్లారు. మరోసారి ఫోన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News