Thursday, January 23, 2025

విద్యుత్ చార్జీల పెంపు

- Advertisement -
- Advertisement -

Increased in electricity charges in Telangana

గృహ విద్యుత్‌పై యూనిట్‌కు 50పైసలు.. పరిశ్రమలకు రూ.1
వ్యవసాయ వినియోగంపై ఏప్రిల్ 1 నుంచి అమలు

ఐదేళ్ల తర్వాత
పెరిగిన చార్జీలు
రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ
రూ.8,221 కోట్లు

మన తెలంగాణ/హైదరాబాద్: అనివార్యమైన చార్జీల పెంపు నిర్ణయాన్ని పెంచుతూ తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టిఎస్‌ఇఆర్‌సి) తీసుకొంది. గృహ వినియోగదారులకు ఒక్కో యూనిట్ విద్యుత్తుపై అదనంగా 50 పైసలు, పరిశ్రమలు వాడే విద్యుత్ ధరను రూ.1 పెంచుతూ విద్యుత్తు నియంత్రణ మం డలి చైర్మన్ శ్రీరంగారావు ఉత్తర్వులు జారీ చేశారు. రైతాంగానికి ఇ స్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తును యథావిధిగా కొనసాగిస్తూ ఇఆర్‌సి ఆదేశాలిచ్చిం ది. పెంచిన విద్యుత్తు చార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. 2022-23వ సంవత్సరానికి విద్యుత్ రం గానికి అయ్యే ఖర్చులకు తగినంతగా ఆదాయం లేకపోవడం, పాత విద్యుత్తు చార్జీల మూలంగా వేలాది కోట్ల రూపాయల నష్టాలు వస్తుండడంతో అయిదేళ్ల స్వల్పంగా చార్జీలు పెంచుకోవడానికి డిస్కంలకు అనుమతిని ఇస్తూ విద్యుత్తు నియంత్రణ మండలి అనుమతులు మంజూరు చేసింది. అంతేగాక గృహ వినియోగదారులు, నిరుపేదలు వాడుకునే విద్యుత్తులోనూ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుకు అయ్యే ఖర్చు మొత్తాన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఏకంగా రూ.8,221 కోట్ల 17 లక్షల ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తోంది. డిస్కంలపై భారీ నష్టాలను తగ్గించడానికి చార్జీలను పెంచక తప్పడం ఇఆర్‌సి శ్రీరంగారావు బుధవారం మీడియాకు వివరించారు.

2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2022 వరకూ చార్జీలను పెంచలేదని, దీంతో డిస్కంలు ఆ ర్థికంగా ఎన్నో నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని, ఈ నష్టాలను పూడ్చడానికి ఈ కొద్దిపాటి చార్జీల పెంపు అనివార్యమైందని చైర్మన్ వివరించారు. పరిశ్రమలపై ఇప్పుడున్న చార్జీలకు అదనంగా యూనిట్‌కు ఒక్క రూపాయి చొప్పున పెంచామని చెప్పారు. పేద ప్రజలు వినియోగించుకునే కరెంటుపై పెద్దగా భారం పడకుండా ఉండేందుకు బిపిఎల్ కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రూ.1466 కోట్లు, వ్యవసాయ వినియోగదారులకు సబ్సిడీ రూపంలో (ఉచిత విద్యుత్తు) రూ.6,850 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని వివరించారు. గతంలో రూ.5,940 కోట్లుగా ఉన్న సబ్సిడీ భారం ఇప్పుడు రూ.8,221 కోట్ల 17 లక్షలకు పెరిగిందని, ప్రభుత్వ ఖజానాకు ఇది పెను భారమే అయినప్పటికీ ప్రభుత్వం ఆ నిధులను డిస్కంలకు చెల్లించేందుకు ముందుకు వచ్చిందని, అందుకే ఈ విద్యుత్తు చార్జీల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామని విద్యుత్తు నియంత్రణ మండలి చైర్మన్ శ్రీరంగారావు వివరించారు.

వాస్తవానికి డిస్కంలు 2022-23వ ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.53,053 కోట్ల 55 లక్షల వరకు నిధులు అవసరమవుతాయని డిస్కంలు ప్రతిపాదించాయన్నారు. అయితే కమీషన్ మాత్రం డిస్కంల ప్రతిపాదనలను కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత రూ.48,708 కోట్ల 27 లక్షల ఏఆర్‌ఆర్‌లకు అమోదం తెలిపినట్లుగా చైర్మన్ వివరించారు. ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి విద్యుత్తు చార్జీలను పెంచుకొని రూ.6,831 కోట్ల అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవాలని డిస్కంలు ప్రతిపాదించాయని, అయితే డిస్కంల ప్రతిపాదనలకు కమీషన్ అంగీకరించలేదని, అధ్యయనం చేసిన తర్వాత చార్జీ ల పెంపుతో అన్ని వర్గాల ప్రజల నుంచి కేవలం 5,596 కోట్ల రూపాయలను రాబట్టుకునే విధంగా కమీషన్ అనుమతులు ఇచ్చిందని చైర్మన్ వివరించారు.

అంటే 18 శాతం వరకూ చార్జీలు పెంచుకోవడానికి అనుమతించాలని డిస్కంలు కోరాయని, కానీ కమీషన్ అధ్యయనం చేసిన తర్వాత 14 శాతం మాత్రమే చార్జీలు పెంచుకోవడానికి అనుమతించామని చైర్మన్ వివరించారు. విద్యుత్తు కొనుగోలు ఖర్చు పెరగడం, పంపిణీ ఖర్చులు, ట్రాన్స్‌మిషన్ వ్యయం భారీగా పెరిగాయని, అందుకే చార్జీలు స్వల్పంగా పెంచక తప్పడంలేదని వివరించారు. ఒకటి నుంచి 50 యూనిట్ల వరకూ విద్యుత్తును వినియోగించుకునే నిరుపేదలకు కూడా 19 ఏళ్ళ తర్వాత స్వల్పంగా చార్జీలు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్న సెలూన్ షాపులు, ఇతర వృత్తిదారులకు ఎలాంటి చార్జీల పెంపు లేదు. ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్‌పైన కూడా చార్జీలు పెంచలేదని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News