Monday, November 25, 2024

మూడు జిల్లాల్లో పెరిగిన భూముల లావాదేవీలు

- Advertisement -
- Advertisement -

అక్టోబర్‌లో 25 శాతం పెరిగిన రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు
అక్టోబర్ నెలలో నమోదైన ఆస్తుల విలువ రూ. 3,170 కోట్లు
తాజా నివేదికను విడుదల చేసిన నైట్ ఫ్రాంక్ ఇండియా

మనతెలంగాణ/హైదరాబాద్:  హైదరాబాద్, మేడ్చల్ -మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలో రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్‌లు అక్టోబర్ నెలలో 25 శాతం పెరిగిందని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో తెలిపింది. గత నెల అక్టోబర్‌లో 5,787 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక ప్రకారం ఏడాది ప్రాతిపదికన 25 శాతం పెరిగిందని నైట్‌ఫ్రాంక్ తెలిపింది. అక్టోబర్ నెలలో నమోదైన ఆస్తుల మొత్తం విలువ రూ.3,170 కోట్లుగా ఉందని, ఇది కూడా 41 శాతం పెరిగిందని ఈ నివేదికలో పేర్కొంది. అక్టోబర్‌లో హైదరాబాద్‌లో అధిక ఆస్తి రిజిస్ట్రేషన్లు రూ.25 నుంచి 50 లక్షల రూపాయిల విలువ గల ఆస్తుల రిజిస్ట్రేషన్ జరిగినట్టు నైట్‌ఫ్రాంక్ తెలిపింది. 25 లక్షల రూపాయలు కంటే తక్కువ ధర గల ప్రాపర్టీలు మొత్తం ఈ రిజిస్ట్రేషన్‌లో 16 శాతం ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది.
మేడ్చల్ -మల్కాజిగిరిలో స్థిరంగా 43 శాతం గృహ విక్రయాలు…
జిల్లా స్థాయిలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, మేడ్చల్-మల్కాజిగిరిలో స్థిరంగా 43 శాతం గృహ విక్రయాల రిజిస్ట్రేషన్‌లతో అగ్రస్థానంలో ఉండగా, రంగారెడ్డి జిల్లా 42 శాతం విక్రయాలతో దగ్గరగా ఉంది. దీనికి విరుద్ధంగా, అక్టోబర్ 2023లో మొత్తం రిజిస్ట్రేషన్‌లో హైదరాబాద్ జిల్లా వాటా 14 శాతం కాగా, నివేదికల ప్రకారం రెసిడెన్షియల్ ప్రాపర్టీల సగటు ధరలు 6.8 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఆస్తుల ధరలు వరుసగా 6 శాతం పెరిగాయి. అక్టోబర్ లో హైదరాబాద్‌లో నివాస విక్రయాలు ప్రధానంగా 1,000-2,000 చదరపు అడుగుల ప్రాపర్టీలో ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News