- Advertisement -
తిరువనంతపురం : శబరిమల అయ్యప్పస్వామిని దర్శించే రోజువారీ భక్తుల సంఖ్యను 5 వేల నుంచి 10 వేలకు పెంచారు. కేరళ ప్రభుత్వం ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భక్తులు కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని అధికారులకు సూచించింది. శబరిమల ఆలయాన్ని మాస పూజలకు శుక్రవారం తెరిచారు. ప్రధాన పూజారి వీకే జయరాజ్ పొట్టి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తాంత్రి కందారు మహేష్ మోహనారు సమక్షంలో పంప్రదాయ పద్ధతితో ఆలయాన్ని తెరిచారు.
- Advertisement -