69 శాతం బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్న వినియోగదారులు
ఆన్‌లైన్‌లో వసూలయ్యే మొత్తం రూ.710 నుంచి 760 కోట్లు
మనతెలంగాణ,సిటీబ్యూరో: విద్యుత్ శాఖలో ఆన్‌లైన్ బిల్లులు చెల్లిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. విద్యుత్ బిల్లులు ఇంత వరకు ఈఆర్వో కార్యాలయాల్లో, మీ సేవా కేంద్రాల్లో వినియోగదారులు చెల్లించే వారు. చాలా తక్కువ మంది మాత్రమే ఆన్‌లైన్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో బిల్లులు చెల్లించడానికి విద్యుత్ ఉన్నతాధికరులు అధునాత టెక్నాలజిని వినియోగించడంపై విస్తృత ప్రచారం కూడా చేశారు. అంతే కాకుండా బిల్లులు చెల్లించడానికి ఈఆర్వో కార్యాలయం, మీసే కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నెట్ అవకాశం ఉన్న వారు ఇంటి వద్ద నుంచే పేటిఎం ద్వారా చెల్లంచేందుకు అవకాశం ఇవ్వడంతో వినియోగదారులు ఆ దిశగా బిల్లులు చెల్లింపుల మీద దృష్టి సారించారు.
ఈఆర్‌వో ,స్పాట్ కనెక్షన్ల, ఈ సేవా కేంద్రాలు, కార్పోరేట్ కలెక్షన్స్, టిఎస్‌ఆన్‌లైన్, బిల్ జంక్షన్, బిల్‌డెస్క్, ఈసిఎస్, బిల్ డెస్క్‌క వెబ్‌సైట్స్ ద్వారా విద్యుత్ వనియోగదారులు చెల్లిస్తున్నారు.ప్రధానంగా మీ సేవా కేంద్రాలలో, ఈఆర్వో కేంద్రాలలో బిల్లులు చెల్లించడానికి వెళితే అక్కడ ఉండే క్యూ లైన్లలో నిలబడి చెల్లించడంతో వినియోగదారులకు ఇబ్బందిగా మారింది.దీంతో ఎటువంటి చార్జీలు లేకుండా పేటీఎం ద్వారా చెల్లించడానిక ఎస్‌పిడీసీఎల్ అవకాశం కల్పించింది. దీంతో వినియోగదారులు ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా బిల్లులు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు.గ్రేటర్ హైదరాబాద్‌లోమొత్తం విద్యుత్ కనెక్షన్లు 52,76,518 ఉన్నారు. ఇందులో గతంలో 40 నుంచి 45 శాతం బిల్లులు ఆన్‌లైన్ ద్వారా చెల్లించేవారు.
గత రెండు మూడు నెలలుగా విద్యుత్ వినియోగదారులు ఆన్‌లైన్ చెల్లింపులు పట్ల ఆసక్తి చూపడంతో ఒక సారి భారీ ఎత్తున ఆన్‌లైన్ చెల్లింపులు పెరిగాయి. ఐదారుశాతం నుంచి ఆన్‌లైన్ చెల్లింపులు 69 శాతానకి చేరుకున్నాయంటే వినియోగదారులు ఆన్‌లైన్ వైపు మళ్ళినట్లు అర్దం అవుతోంది. ఇటీవల కాలంలో విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించాల్సిన సమయం దాటిపోగానే బిల్లు వసూలు చేయడమో లేక విద్యుత్ కనెక్షన్ తొలగించడమో అనే పద్దతిని కొనసాగిస్తుండటంలో ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ శాఖ క్షేత్ర స్థాయి అధికారుల నుంచి బిల్లుల కోసం వత్తిడి పెరుగుతండటంతో చెల్లించడానికి సమయం లేని వారు ఆన్‌లైన్‌లో చెల్లింపులు మరింత పెరిగే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
సర్కిళ్ళవారీ ఆన్‌లైన్ చెల్లింపుల వివరాలు
సర్కిల్స్ విద్యుత్ కనెక్షన్లు వసూలయ్యే మొత్తం ఆన్‌లైన్ శాతం
బంజారాహిల్స్ 369846 77.94 69.55
సైబర్ సిటీ 375178 83.67 71.54
హైదరాబాద్ సెంట్రల్ 570340 93.84 62.06
హబ్సిగూడ 581772 88.72 67.87
హైదరాబాద్ సౌత్ 662087 72.05 43.04
మేడ్చెల్ 684078 72.32 72.32
రాజేంద్రనగర్ 541243 40.29 40.29
సరూర్‌నగర్ 643895 64.84 64.84
సికింద్రాబాద్ 492628 68.19 68.19