పురపాలక, నగరపాలక సంస్థల్లో పెరిగిన ఆస్తి
పన్ను వసూళ్లు నేడు, రేపు పన్ను చెల్లిస్తే
90శాతం రాయితీ వర్తింపు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గా ను పన్ను వసూళ్లలో రూ.1,000 కోట్ల మైలురాయిని దా టాయి. 202324 ఆర్ధిక సంవత్సరంలో రూ.922 కోట్లు వసూళ్లు కాగా, 202425 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఇ ప్పటికే రూ.1,010.00 కోట్లు వసూళ్లు అయినట్టు పురపాల క శాఖ అధికారులు తెలిపారు. నేడు, రేపు కూడా ఆస్తి ప న్ను వసూళ్లను తమ సిబ్బంది చేపడుతారని, సెలవు దినాలు లేద ని ఆస్తిపన్ను చెల్లించడానికి ప్రజలు కూడా సహకరించాలని పురపాలక శాఖ అధికారులు పేర్కొన్నారు.
202425 ఆర్థి క సంవత్సరం ముగింపునకు కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున ప్రజలు తమ ఆస్తిపన్ను బకాయిలు చెల్లించాలని పురపాలక శాఖ అధికారులు సూచించారు. ఆస్తిపన్నును చెల్లించి ప్రభుత్వం కల్పించిన పాత బకాయిలపై ఉన్న అపరాధ రుసుముపై 90 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని పురపాలక శాఖ పేర్కొంది.