Monday, December 23, 2024

గురుకుల బోధనా సిబ్బంది వేతనాలు పెంపు

- Advertisement -
- Advertisement -

Increased salaries of teaching staff working as guest faculty in BC Gurukul

జూన్ 6న మహిళా డిగ్రీ కాలేజీ ప్రవేశ పరీక్ష
బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం

మనతెలంగాణ/ హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా పూలే బిసి గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ గా పనిచేస్తున్న బోధనా సిబ్బంది వేతనాలు పెంచారు. మార్చి నెల నుంచి పెంచిన వేతనాలు అమలులోకి వస్తాయని బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, బుర్రా వెంకటేశం తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. గెస్ట్ టీచర్‌కు గతంలో గంటకు రూ.140 చెల్లించగా పెరిగిన వేతనం ప్రకారం గంటకు రూ.240 చెల్లిస్తారు. అదే విధంగా గెస్ట్ లెక్చరర్‌కు గతంలో గంటకు రూ.180 ఉండగా రూ. 270 పెంచారు. బోధన సిబ్బందితో పాటు బోధనేతర సిబ్బంది వేతనాలు కూడా పెంచామని బుర్రా వెంకటేశం తెలిపారు. రాష్ట్రంలోని బిసి గురుకుల విద్యాసంస్థల్లో 2022- 23 విద్యాసంవత్సరం కోసం నోటిఫికేషన్ విడుదల చేశామని, ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

పదో తరగతి పరీక్ష రాస్తున్న వారు ఇంటర్ కోర్సుల కోసం, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష రాస్తున్న బాలికలు మహిళా డిగ్రీ కాలేజీలో ప్రవేశం కోసం ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 6న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 119 గురుకుల విద్యాసంస్థలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసి బిసి విద్యార్థులకు ఉన్నత విద్యను ప్రభుత్వం అందిస్తున్నదని ఆయన తెలిపారు. బిసి విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించి వారికి విద్యను అందించాలని వెంకటేశం కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News