Monday, November 18, 2024

హోంగార్డుల గౌరవవేతనం 30%పెంపు

- Advertisement -
- Advertisement -

Increased salaries of TS homeguards

రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు
ఈ ఏడాది జూన్ నుంచే అమలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు ప్రభుత్వం వేతనాలు పెంచుతూ కొత్త సంవత్సరం కానుక అందించింది. రాష్ట్రంలో హోంగార్డుల గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచుతూ హోంశాఖ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. హోంగార్డులకు పెరిగిన వేతనాలు 2021, జూన్ నుంచి అమలు కానున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీసు శాఖలో కింది స్థాయి ఉద్యోగులుగా సేవలందిస్తున్న హోం గార్డులకు తెలంగాణ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరస్తూ వస్తోంది. కాగా ప్రస్తుతం హోంగార్డులకు నెలకు రూ.22 వేల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఇదివరలో సైతం హోం గార్డుల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హోం శాఖలో హోంగార్డులు కీలకంగా వ్యహరిస్తూ విశేష సేవలను అందిస్తున్నారని, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో వీరి సేవలను గుర్తించిన ప్రభుత్వం అంచలంచెలుగా వీరి వేతనాలు పెంచింది. తాజాగా 30 శాతం వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై హోంగార్డులు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News