మనతెలంగాణ/హైదరాబాద్:సార్వత్రిక ఎన్నికలు ముగిసి న వేళ వాహనదారులకు బిగ్ షాక్ తగులనుంది. దేశవ్యా ప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీలు సగటున 5 శాతం పెరగనున్నాయి. అయితే ఎంపి ఎన్నికల సంద ర్భంగా ఛార్జీల పెంపు నిర్ణయాన్ని జాతీయ రహదారుల ప్రా ధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తాత్కాలికంగా వాయిదా వే సిన విషయం తెలిసిందే.
ఏప్రిల్ ఒకటో తేదీన టోల్ ఛార్జీలు పెంచుతున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది. కాగా, కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఛార్జీ ల పెంపు అంశాన్ని ఈసీ వద్దకు తీసుకెళ్లింది. దీంతో ఈసీ ఎన్నికల నేపథ్యంలో పెంపు నిర్ణయం వాయిదా వేయాలని ఎన్‌హెచ్‌ఏఐను ఆదేశించింది. దీంతో కొత్త ఛార్జీల పెంపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఏడో విడత పో లింగ్ ముగియడంతో దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. దీంతోనే ఎన్నికల కోడ్ ముగిసింది. తాజాగా ఎన్‌హెచ్‌ఏఐ ఈ అర్ధరాత్రి నుంచి కొత్త టోల్ ఛార్జీలు వసూలు చేయనుంది.
ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల టోల్‌పై
ఒక వైపు రూ.5లు, ఇరువైపులా రూ.10లు
పెరిగిన టోల్ ఛార్జీలు జూన్ 3వ తేదీ (నేటి) నుంచి అ మల్లోకి రానున్నాయి. పెంచిన ధరలు 2025 మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. నేషనల్ హైవేలపై కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5లు, ఇరు వైపులా కలిపి రూ.10లు, చిన్నపాటి కమర్షియల్ వాహనా లు ఒక వైపు ప్రయాణానికి రూ.10లు, ఇరువైపులా కలిపి రూ.20లు, బస్సులు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.25లు, ఇరువైపులా కలిపి రూ.35లు, పెద్ద ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు ఒక వైపు ప్రయాణానికి రూ.35లు, ఇరువైపులా కలిపి రూ.50ల వరకు పెంచారు. నెలవారీ పాస్ రూ.330 నుంచి రూ. 340లకు పెరిగింది.
ఓఆర్‌ఆర్‌పై పెరిగిన టోల్‌చార్జీలు ఇలా…
కారు, జీపు, వ్యాను, ఎల్‌ఎంవై, ఎస్‌యూవి, ఎంపివి వాహ నాలకు రూ.2.34 పైసలు, (ప్రతి కిలోమీటర్‌కు) ఎల్‌సివి/ మినీబస్‌కు రూ.3.77 పైసలు (ప్రతి కిలోమీటర్‌కు), బస్ /2, యాగ్జిల్ ట్రక్‌కు రూ.6.69 పైసలు (ప్రతి కిలోమీట ర్‌కు), 3 యాగ్జిల్ వాణిజ్య వాహనానికి రూ.8.63 పైసలు (ప్రతి కిలోమీటర్‌కు), భారీ నిర్మాణ మెషినరీ/ఎర్త్ మూవిం గ్ ఎక్విప్‌మెంట్/4/5/6యాగ్జిల్ ట్రక్కులు రూ.12.40 పైసలు, ఓవర్‌సైజ్డ్ వాహనాలు (7 లేదా అంతకంటే ఎక్కువ యాగ్జిల్)కు రూ.15.09 పైసలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్‌ఎండిఏ అధికారులు తెలిపారు.