జీవో జారీ చేసిన రవాణశాఖ కార్శదర్శి
మన తెలంగాణ, హైదరాబాద్ : హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలో వాహనాల స్పీడ్ లిమిట్‌ను పెంచుతూ రవాణశాఖ ప్రభుత్వ కార్యాదర్శి కె.ఎస్. శ్రీనివాసరాజు బుధవారం ఉత్తర్వులు (జీవో నెం ః 82) జారీ చేశారు. ఇప్పటి వరకు జిహెచ్‌ఎంసిలో అన్ని వాహనాల స్పీడ్ లిమిట్ 40 ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం స్పీడ్ లిమిట్‌ను గ్రేటర్ హైదరాబాద్‌లో డివైడర్ ఉన్న ప్రాంతాల్లో కార్లు గంటకు 60 కిలో మీటర్లను, అదే విధంగా బస్సులు, బైక్‌లు స్పీడ్ లిమిట్ 50 కిలో మీటర్లు నిర్ణయించారు. నగర పరిధిలో డివైడర్లు లేని ప్రాంతాల్లో కార్ల వేగాన్ని గంటలకు 50 కిలో మీటర్లు కాగా బస్సులు ,బైక్‌ల వేగాన్ని మాత్రం గంటలకు 40 కిలో మీటర్లుగా నిర్ణయించగా, కాలనీల్లో మాత్రం అన్ని రకాల వాహనాలు గంటకు 30 కిలోమీటర్లు మించకూడదని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.