Sunday, November 17, 2024

పెరిగిన పంట రుణ పరిమితి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయరంగంలో పం టల సాగుకు అవసరమైన పెట్టబడి సాయం అందించేందు కు బ్యాంకుల ద్వారా ప్రతియేటా అందజేస్తున్న పంటల రుణ పరిమితులు పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌బ్యాంక్ రుణ పరిమితులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల పంటలకు ప్రస్తుతం అమల్లో ఉన్న రుణ పరిమితి కంటే సగటున రెండు వేల రూపాయలు పెంచింది. ప్రధాన ఆహారధాన్య పంటల్లో ఎకరం పంట సాగుకు పెట్టుబడి రుణ పరిమితి వరికి రూ.43వేల నుంచి 45వేలకు పెం చింది. శ్రీవరికి రూ.36వేలనుంచి 38వేలకు పెంచింది.. జొన్నకు రూ.18వేలనుంచి 20వేల కు పెరిగింది. సజ్జకు రూ.15వేలనుంచి 17వేలకు, మొక్కజొన్నకు రూ.32వేలనుంచి 34వేలకు పెరిగింది.పప్పుధా న్య పంటలకు సంబంధించి కందికి రూ.22వేలనుంచి 24 వేలకు, మినుముకు రూ.19నుంచి 21వేలకు, పెసరకు రూ.20నుంచి 22వేలకు పెరిగింది.

నూనెగింజ పంటల సాగుకు సంబంధించి వేరుశెనగకు రూ.28వేలనుంచి 30 వేలకు, నూగుకు రూ19వేల నుంచి 21వేలకు, ఆవాలుకు రూ.14వేలనుంచి 15వేలకు పె రిగాయి. ప్రధాన వాణిజ్య పంటల సాగులో పత్తికి రుణ పరిమితి రూ.44వేలనుంచి 46వేలకు , చెరకు సాగుకు రూ. 78వేలనుంచి రూ.80వేలకు, మిరప సాగుకు రూ.82వేలనుంచి రూ.84వేలకు పెరిగాయి. ఉద్యాన పంటల సాగులో పంట రుణ పరిమితి ఆయిల్‌పామ్ తోటల సాగుకు రూ.42 వేలనుంచి 44వేలకు పెరిగింది. అరటి సాగుకు రూ.95వేలనుంచి 97వేలకు నిమ్మ సాగుకు రూ.43వేలనుంచి 45వేలకు పెరిగింది. మామిడి సాగుకు రూ.42వేలనుంచి 44వేల కు, డ్రాగన్ ఫ్రూట్ సాగకు రూ.78వేలనుంచి 80వేలకు జా మతోట సాగుకు రూ.45వేలనుంచి 47వేలకు పెరిగింది. సు గంధ ద్రవ్య పంటల సాగులో పసుపు సాగుకు రుణ పరిమితి రూ.85వేలనుంచి 87వేలకు పెరిగింది. ఫ్లోరికల్చర్‌లో పూల తోటల సాగుకు రూ.50వేలనుంచి 52వేలకు పెరిగింది. కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ ఎకరానికి రూ.33వేలనుంచి ఏకంగా రూ.67వేలకు రుణపరిమితిని పెంచింది. అంతే కాకుండా మిద్దెతోటల సాగును కూడా ప్రోత్సహిస్తోంది. మిద్దెతోటల సాగులో పంటరుణం రూ.32వేలు నిర్ణయించింది.

పశుసంవర్ధక యూనిట్లకు 10శాతం పెంపుదల
పంటరుణాల పరిమితిని పెంచటంతోపాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలుగా రైతులకు అదనపు ఆదాయంగా ఉంటూ వస్తున్న పశుసంవర్ధక యూనిట్ల ఏర్పాటుకు కూడా బ్యాంకుల ద్వారా రుణ పరిమితులను పెంచింది. కోళ్ల పెంపకం, పాడి పశువుల పెంపకం , గొర్రెలు, మేకల పెంపకం, చేపల పెంపకంలో ఒక్కో యూనిట్‌పైన 10శాతం రుణ పరిమితి పెరిగింది.
వానాకాలం నుంచి అమలు
పంటల సాగు పెట్టుబడి రుణాల పరిమితి పెంపుదల ఈ ఆర్ధిక సంవత్సరంలో వానాకాల సీజన్ నుంచి అమల్లోకి రానుంది. యాసంగి సీజన్‌కు కూడా ఇదే రుణ పరిమితి వర్తించ నుంది.మొత్తం 124రకాల పంటలతోపాటు, పశుసంవర్ధక యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకుల ద్వారా రుణాల పరిమితి పెంపుదల అమల్లోకి రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News