Thursday, January 23, 2025

పెరుగుతున్న కోవిడ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,193 కరోనా కేసులు నమోదయ్యా యని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. ప్రస్తుతం 67,556 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. రోజుకు 6.17 శాతం కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.దేశ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 42 మంది కరోనాతో మృతి చెందారు. అందులో ఒక్క కేరళ నుంచి 10 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి అప్రమత్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News