Friday, January 3, 2025

విద్యుత్ చార్జీలు పెంచడమంటే ప్రజలను మోసం చేయడమే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పీక్ లోడ్ అవర్స్ లో ప్రతి యూనిట్ కి ఇరవై శాతం అదనపు చార్జీల వసూలు చేయాలన్న కేంద్ర నిర్ణయంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండి పడ్డారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి విద్యుత్ చార్జీల పెంచడమంటే దేశ ఆర్థికాభివృద్ధికి ద్రోహం చేయడమే అని అన్నారు. పీకేలోడ్ అవర్స్ చార్జీల పెంపకం ప్రగతిశీల నిర్ణయం కాదన్న మంత్రి, విద్యుత్ చార్జీల భారం మోపడమంటే దేశ ప్రగతికి అడ్డుకోవడమే అని పేర్కొన్నారు . తాము కేంద్ర నిర్ణయాన్ని కచ్చితంగా వ్యతిరేకిస్తాం అన్నారు. పేదల పై భారం వేయడాన్ని అడ్డుకుంటాం అన్నారు. ఇప్పటికే ట్రూ అప్ చార్జీల భారం రాష్ట్రం మోస్తుందన్నారు. ప్రజల పై భారం వేసే ఏ చర్యలకైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మద్దతు ఉండదని మంత్రి అన్నారు.
దేశ ప్రజలను విద్యుత్ వినియోగానికి కి దూరం చేసే కుట్ర కేంద్రం ప్రభుత్వం చేస్తుందని అన్నారు.ప్రజల పై భారం వేయడం దుర్మార్గం మైన చర్య గా మంత్రి అన్నారు.కార్పొరేట్ల కు లాభం కోసమే మోడీ పరిపాలన నడుస్తుంది అని హెద్దేవా చేశారు.
2014 ముందు ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యుత్ ఇస్తామన్న కేంద్రం, నేడు సాధారణ ప్రజలకు విద్యుత్ ని దూరం చేస్తుంది అన్నారు.

కేంద్రం వ్యాపారాలు చేయమంటూనే బడా వ్యాపారుల కోసమే పనిచేస్తుంది అన్నారు. ప్రజల జీవితాలతో మమేకమైన విద్యుత్ వాడకమైన నేపథ్యం లో పేద ప్రజలకు విద్యుత్ సబ్సిడీలు ఎత్తేసే కుట్ర జరుగుతుంది అన్నారు.గతంలోనూ వారు చెప్పిన విధంగా మీటర్లు బిగించడానికి ఒప్పుకోలేదని,తెలంగాణ విద్యుత్ పై కుట్రలు చేసి రుణాలు రాకుండా అడ్డుకున్నారు అని తీవ్ర స్థాయి లో మండి పడ్డారు.కేంద్ర నిర్ణయంతో అంతిమంగా పేద ప్రజల పైనే భారం పడుతుందన్నారు.ఇప్పటికే గ్యాస్ డీజిల్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వానికి ఇపుడు విద్యుత్ చార్జీల పెంపకం నిర్ణయం మంచిది కాదని అన్నారు.మోడీ దుర్మార్గపు , పాపపు పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడాలి అని మంత్రి పిలుపు నిచ్చారు. పేదలు మరింత పేదలుగా మారేలా మోడీ పాలన సాగుతుంది అని అన్నారు.తెలంగాణా ప్రభుత్వం సబ్సిడీల భారాన్ని భరించి నాణ్యమైన విద్యుత్ ఇస్తుంటే, కేంద్రం ప్రభుత్వం మాత్రం ప్రజల పై భారం వేస్తుంది అని .. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజా క్షేత్రం లోనే తీల్చుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News