Saturday, November 23, 2024

పెరుగుతున్న మెట్రో ప్రయాణికులు

- Advertisement -
- Advertisement -

సెప్టెంబర్ 23వ తేదీన ఒక్కరోజే 5.47 లక్షల మంది ప్రయాణం
ఆల్‌టైం రికార్డు సృష్టించిన మెట్రో
ప్రస్తుతం ప్రతి రోజు 4.62 లక్షల మంది ప్రయాణికుల చేరవేత

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ టైం, సౌకర్యవంతంగా ఉండటంతో యువత, వృద్ధులు, ఉద్యోగులు, కాలేజీ స్టూడెంట్లు మెట్రోలో ప్రయాణించేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సెప్టెంబర్ 23వ తేదీన ఒక్కరోజే 5.47 లక్షల మంది మెట్రోలో ప్రయాణించడంతో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.

ఈ నేపథ్యంలోనే 2023 ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ క్వార్టర్స్‌లో సగటున రోజుకు 3.55 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారని మెట్రో అధికారులు తెలిపారు. జూలై 1నుంచి సెప్టెంబర్ 30వ తేదీ నాటికి మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య వేగంగా ముందుకు సాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతి రోజు 4.62 లక్షల మంది ప్రయాణికులు ఈ మెట్రో సేవలు వినియోగించుకుంటున్నాని మెట్రోసంస్థ తెలిపింది. పెరిగిన మెట్రో ప్రయాణికుల సంఖ్యతో ఈ త్రైమాసికంలో లాభాలు భారీగా వచ్చాయని మెట్రోవర్గాలు తెలిపాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News